మంగళవారం నాడు  అరుణ్ సాగర్ అవార్డుల ప్రదానొత్సవం

 మంగళవారం నాడు  అరుణ్ సాగర్ అవార్డుల ప్రదానొత్సవం
January 02 10:24 2018
హైదరాబాద్,
అరుణ్ సాగర్ ఉత్తమ జర్నలిస్ట్ అవార్డుల ప్రదాన కార్యక్రమం మంగళవారం రోజు  పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు జరుగుతుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.  టివీ 5  సౌజన్యంతో మీడియా అకాడమీ ఈ అవార్డులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు ముఖ్య అతిథి గా హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విశిష్ట అతిథిగా , శాసన మండలి విప్ పల్లా రాజేశ్వరరెడ్డి , టీవీ 5 ఎండీ బీ  రవీంద్రనాథ్ గౌరవ అతిథులుగా పాల్గొనే ఈ కార్యక్రమం లో ప్రముఖ కవి , గాయకుడు గోరటి వెంకన్న కు అరుణ్ సాగర్ సాహితీ పురస్కారం అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో భాగంగా సోషల్ మీడియా- మెయిన్ స్ట్రీమ్ మీడియా అనే అంశం పై పాత్రికేయుడె  పాలగుమ్మి సాయినాథ్ ప్రసంగిస్తారని అల్లం నారాయణ చెప్పారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14352
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author