ఏ వర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదు : జగన్

ఏ వర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదు : జగన్
January 02 10:27 2018
చిత్తూరు,
చిత్తూరు జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి 49వ రోజు ప్రజా సంకల్ప యాత్ర కొనసాగింది. సోమవారం నాడు అయన జిల్లాలోని చిన్నతిప్ప సముద్రంలో జగన్ పాదయాత్ర చేసారు. పాదయాత్రలో భాగంగా చేనేత కార్మికులతో  ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పించారు. చేనేతలకు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా చంద్రబాబు నెరవేర్చలేదు. ప్రతి కులాన్ని ఎన్ని రకాలుగా మోసం చేయాలో అన్ని రకాలుగా ఆయన మోసం చేశారు.   రాష్ట్రంలోని ఏ వర్గానికి చంద్రబాబు న్యాయం చేయలేదని ఆయన ఆరోపించారు. చంద్రబాబు అందరినీ మోసం చేస్తున్నారంటూ జగన్ వ్యాఖ్యానించారు. చేనేత పార్క్లను ఎక్కడా ఏర్పాటు చేయలేదనీ.. చేనేత రుణాలనూ మాఫీ చేయలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. ప్రజలు కొడతారేమో అనే భయంతో ఎన్నికల మ్యానిఫెస్టోను టీడీపీ తన పార్టీ వెబ్సైట్ నుంచి తీసేసిందని ఆయన అన్నారు. విశ్వసనీయత అనే పదాన్ని రాజకీయ నేతలు మర్చిపోయారని, మాట తప్పితే రాజీనామా చేసి ఇంటికి పోయే రోజు రావాలని అన్నారు. చంద్రబాబు ముష్టి వేసినట్లు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు. అదికూడా సరిగా ఇంజనీరింగ్ విద్యార్థులకు అందడం లేదని విమర్శించారు.
ఉదయం మదనపల్లి నియోజకవర్గం ముదివేడు నుంచి ప్రారంభమైన జగన్ పాదయాత్ర కడప క్రాస్, నడింపల్లి, ఆర్సీ కురవపల్లి, నల్లగుట్టపల్లి, కాయపల్లి మీదుగా అడ్డగింతవారిపల్లికి చేరుకుంది. పాదయాత్రలో జగన్ ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. పాదయాత్ర వద్దకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి జగన్కు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. జగన్ వారికి భరోసా ఇచ్చారు. ఆర్సీకురవపల్లిలో ప్రజలు, అభిమానులు జగన్కు ఘన స్వాగతం పలికారు. పాదయాత్ర చిలకవారిపల్లి, రేగంటివారిపల్లి మీదుగా సీటీఎం వరకు కొనసాగింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14355
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author