ఇక నుంచి ఎలక్ట్రానిక్‌ తూకం

ఇక నుంచి ఎలక్ట్రానిక్‌ తూకం
January 02 11:14 2018
ఖమ్మం,
ఇక నుంచి ఖమ్మం జిల్లా అంతటా రేషన్ షాపుల్లో ఇ-పాస్ యంత్రాలను వినిగించనున్నారు. ఆహారభద్రత కార్డు ఉన్న కుటుంబంలోని ఎవరైనా తమ వేలిముద్రను బయోమెట్రిక్ మెషీన్ పై నమోదు చేసుకోవడం వారికి బియ్యం అందుతుంది. ఈ యంత్రం ద్వారా సదరు కుటుంబానికి వెళ్లాల్సిన బియ్యం ఎంత అనేది నిర్ణయమవుతుంది. ఫలితంగా అంతే మొత్తం బియ్యం వారికి పంపిణీ చేస్తారు. ఈ సిస్టమ్ ను ఐదు రోజుల్లో జిల్లా అంతటా విస్తరించనున్నారు. ఇ-పాస్ పౌరసరఫరాల వెబ్ సైట్ కు అనుసంధానమై ఉంటుంది. దీంతో బియ్యం పంపిణీ వివరాలు ఎప్పటికప్పుడు రికార్డవుతుంటాయి. ఈ వివరాల ద్వారా డీలర్ కు కేటాయించిన బియ్యం, పంపిణీ అయిన మొత్తం, నిల్వలు లాంటి వివరాలు పక్కాగా ఉంటాయి. ఈ వివరాల ద్వారా అవకతవకలు, తప్పుడు లెక్కలకు ఆస్కారం ఉండదు. ఇక కార్డుదారులకు సైతం కచ్చితమైన తూకంతో బియ్యం పంపిణీ అవుతాయి.
2018 జనవరి 1 నూతన సంవత్సరం తొలి రోజు నుంచే జిల్లాలో బియ్యం పంపిణీలో సరికొత్త విధానం అమలులోకి తెచ్చారు.ఖమ్మం జిల్లాలో 669 రేషన్ షాపులు ఉన్నాయి. వీటిలో 53 దుకాణాలకు డీలర్లను నియమించాల్సి ఉంది. ప్రస్తుతం వీటికి ఇతర డీలర్లే ఇన్ ఛార్జ్ లుగా పనిచేస్తున్నారు. ఇదిలాఉంటే ఇ-పాస్ విధానం ఇంటర్నెట్ పై ఆధారపడి ఉంటుంది. పలు గ్రామాల్లో సిగ్నల్స్ తక్కువగా ఉండడంతో ఇంటర్నెట్ కనెక్టివిటీ సమస్యగా మారింది. దీంతో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు వీటి పనితీరు అంత నాణ్యంగా లేదు. అంతర్జాలం వేగంగా లేకపోవడంతో నమోదు కార్యక్రమానికి అంతరాయం ఏర్పడుతోంది. సెల్ సిగ్నల్స్ ఆధారంగానే ఇ-పాస్ మెషీన్లు పనిచేస్తాయి. సిగ్నల్స్ లేకుంటే యంత్రాలు పనిచేయవు. ఈ సమస్యలు తొలగిపోతే ఇ-పాస్ సిస్టమ్ పక్కాగా పనిచేస్తుంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14369
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author