17 మంది నకిలీ బాబాల లిస్ట్ విడుదల

17 మంది నకిలీ బాబాల లిస్ట్ విడుదల
January 02 12:42 2018
ముంబై,
దేశంలో నకిలీ బాబాలు, వారి అఘాయిత్యాలు పేట్రేగుతున్న నేపథ్యంలో ఈ బూటకపు బాబాలకు సంబంధించిన సరికొత్త నివేదిక బహిర్గతమైంది. దేశంలో ఈ సాధువులకు సంబంధించిన అత్యున్నత సంస్థ 17 మంది కూడిన ఈ నకిలీ బాబాల జాబితాను వెల్లడించింది. వీరిలో నకిలీ బాబాలతోబాటు తమను తాముగా గాడ్‌మన్‌గా సంబోధించుకున్నవారు కూడా ఉన్నారని వెల్లడించింది. అఖిల భారతీయ అఖారా పరిషత్ తాజాగా వీరేంద్రదేవ్ దీక్షిత్ (ఢల్లీ), సచ్చిదానంద సరస్వతి (యూపీ), త్రికాల్ భవంత్ (అలహాబాద్)తో కూడి కొత్త జాబితాను విడుదల చేసింది. ఇప్పటికే సెప్టెంబర్‌లో 14 మంది నకిలీ బాబాల జాబితాను ఈ హిందూ సాధువుల సంస్థ వెల్లడించింది. ఆ జాబితాలోనే డేరా బాబా గుర్మీత్ సింగ్, రాధేమా, నిర్మల్ బాబా, రాంపాల్, ఆశారామ్ బాపూ, ఆయన కుమారుడు నారాయణ్ సాయి ఉన్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌లోని వీరేంద్ర దీక్షిత్ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్రాల నుంచి 47 మంది మహిళలు, ఆరుగురు మైనర్ బాలికలను పోలీసులు విముక్తి చేశారు. ఈ ద్వారకా ఆశ్రమం దాదాపుగా జైలును తలపించేదిగా ఉందని, భక్తులను అందులో నిర్బంధించారని కూడా ఢిల్లీ మహిళా కమిషన్ అధినేత్రి స్వాతి మాలీవాల్ వెల్లడించిన విషయం తెలిసిందే. దేశంలోని అనేక అఖారాల మండలిగా అఖిల భారతీయ అఖారా పరిషత్ పనిచేస్తోంది. 8వ శతాబ్దం నాటి ఆది శంకరాచార్య ఆధ్యాత్మిక వారసత్వాన్ని, వారి విలువలను అందిపుచ్చుకుని ఈ సంస్థ నడుస్తోంది. ఈ తాజా జాబితాను విడుదల చేసి సంఘం అధ్యక్షుడు స్వామి నరేంద్ర గిరి మాట్లాడుతూ, ఈ తరహా నకిలీ బాబాల మాయకు లోనుకావద్దని సామాన్యులకు పిలుపునిచ్చారు. వీరందరూ కూడా ఏ రకమైన సంప్రదాయం, విలువలు లేనివారేనని, వీరి ద్వారా సాధువులు సన్యాసుల సమాజానికే తీరని కళంకం ఏర్పడుతోందని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14396
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author