చలి వణికించేస్తోంది

చలి వణికించేస్తోంది
January 02 17:44 2018
హైదరాబాద్,
 తెలంగాణలోని వేర్వేరు జిల్లాల్లో తీవ్రమైన చలిగాలులు వీస్తున్నాయి. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ చలి వణికిస్తోంది. రాత్రివేళ కనీస ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గిపోయాయి. అన్ని ప్రాంతాల్లోనూ సాధారం కంటే రెండు నుండి ఏడు డిగ్రీల సెల్సియస్ వరకు తక్కువగా నమోదవుతున్నాయి. ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లోని అనేక అటవీ ప్రాంతాల్లో మూడు నుండి నాలుగు డిగ్రీల అత్యల్ప ఉష్ణోగ్రత నమోదవుతోంది. దాంతో గిరిజనులు చలికి తల్లడిల్లిపోతున్నారు. రాష్ట్ర రాజధాని చుట్టూ ఉన్న గ్రామాలు, మున్సిపల్ ప్రాంతాల్లో 10 డిగ్రీల నుండి 14 డిగ్రీల వరకు నమోదవుతోంది. భారత వాతావరణ శాఖ (ఐఎండి) వెల్లడించిన వివరాల ప్రకారం వేర్వేరు ప్రాంతాల్లో గత 24 గంటల్లో నమోదైన కనిష్ట ఉష్ణోత్రలు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్ 6 డిగ్రీలు, భద్రాచలం 10, హకీంపేట 14, హనుమకొండ 14, హైదరాబాద్ 12, మహబూబ్‌నగర్ 15, మెదక్ 9, నల్లగొండ 13 డిగ్రీలు, నిజామాబాద్ 14, రామగుండం 11 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14445
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author