మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం

మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం
January 02 18:51 2018
హైదరాబాద్,
హైదరాబాద్ నగరాన్ని ఓడిఎఫ్గా ప్రకటించడం పట్ల మేయర్ బొంతు రామ్మోహన్ హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరం ఓడీఎఫ్ నగరంగా తీర్చిదిద్దే కార్యక్రమం అత్యంత కఠినమైనప్పటికీ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.టి.రామారావు నిరంతరం ఇచ్చిన స్ఫూర్తితోనే సాధ్యమైందని మేయర్ పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలిపేందుకు  జీహెచ్ఎంసీ చేస్తున్న కృషికి ప్రతి ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.   నగరాన్ని సుందరవనంగా తీర్చిదిద్దేందుకు పురపాలక శాఖ మంత్రి కె.టి.రామారావు ఆశయ సాధనను అమలు చేయాలన్నా దీక్షతో పనిచేస్తున్నామని ఆయన అన్నారు. స్వచ్ఛ హైదరాబాద్ రూపకల్పనలో మంత్రి కె.టి.ఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు కూడా సంచలనాత్మకంగా ఉండి ప్రజలకు వెసులుబాటు కలిగించేవిధంగా ఉన్నాయని ఆయన తెలిపారు. పరిశుభ్రత ప్రాముఖ్యతలో నగర ప్రజలు ప్రతిఒక్కరూ భాగస్వాములుగా ఉండి మన హైదరాబాద్ నగర విశిష్టతను పెంపొందించాల్సిన అవశ్యకత ఎంతైనా ఉందని మేయర్ అన్నారు.
బాధ్యతను మరింత పెంచింది – కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి
హైదరాబాద్ నగరాన్ని ఓడీఎఫ్‌గా కేంద్ర స్వచ్ఛ భారత్ మిషన్ ప్రకటించడం తమకు మరింత బాధ్యత పెరిగిందని జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి పేర్కొన్నారు. నగరంలో బహిరంగ మూత్ర విసర్జన లేకుండా చూసేందుకు నిరంతరం కృషిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. తిరిగి మరో ఆరు నెలలకు ఓడీఎఫ్ పై సర్వే ఉంటుందని పేర్కొన్నారు. ఈ స్ఫూర్తితో 2018 స్వచ్ఛ సర్వేక్షణ్‌లో హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలపడానికి మరింత కృషిచేయనున్నట్టు ప్రకటించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14466
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author