టెంపుల్ సిటీలో ట్రాఫిక్ కష్టం

టెంపుల్ సిటీలో ట్రాఫిక్ కష్టం
January 02 20:44 2018
తిరుమల,
ఆధ్యాత్మిక నగరం తిరుపతి ప్రధాన రహదారుల్లో వాహనాల రద్దీ రోజురోజుకు పెరిగి పోతోంది. దీంతో స్థానికులకే కాక శ్రీవారి భక్తులకూ ట్రాఫిక్ సమస్యలు తప్పడంలేదు. లక్ష కుటుంబాలు, నాలుగు లక్షల జనాభా నివసిస్తున్న స్థానికులతో పాటు నిత్యం లక్ష మంది యాత్రికులు తిరుమలకు, విద్యా, ఉద్యోగ, ఉపాధి, వర్తక, వాణిజ్య అవసరాల కోసం తిరుపతికి వస్తుంటారు. నగరంలోని రోడ్ల సామర్థ్యానికి, ప్రస్తుత ట్రాఫిక్‌కు ఏ మాత్రం పొంతన లేకపోవడంతో ట్రాఫిక్‌, పార్కింగ్‌ సమస్య వేధిస్తోంది. రవాణా అవసరాలకు అనుగుణంగా ప్రత్యేక ప్రవేశ మార్గాలను రూపొందిస్తున్నామని అధికారులు చాలాకాలంగా చెప్తున్నారు. అయితే ఆ దిశగా చర్యలు మందకొడిగా ఉండడంతో ట్రాఫిక్ చిక్కులకు చెక్ పడడంలేదు. దేశంలో అభివృద్ధి చెందుతున్న నగరాల్లో తిరుపతి ఒకటి. స్మార్ట్‌సిటీగా ఎంపిక కావడంతో నగర రూపురేఖలు మారిపోతున్నాయి. ప్రణాళికల స్థాయిలో ఉన్న స్మార్ట్‌సిటీ ప్రతిపాదనలు కార్యరూపం దాల్చేందుకు రోజులు సమీపిస్తున్నాయి. అయితే తిరుపతిలో ప్రధాన సమస్యగా భావిస్తున్న ట్రాఫిక్‌ రద్దీకి పరిష్కారం చూపిన తర్వాతే స్మార్ట్‌సిటీ పనులకు మార్గం సుగమం అవుతుందని అంతా అంటున్నారు.
పురాతన నగరంలో ఉన్న 439 కి.మీ రహదారి వ్యవస్థ ప్రస్తుత ట్రాఫిక్‌ సామర్థ్యానికి ఏ మాత్రం సరిపోవడం లేదు. ప్రధాన రహదారులు, అంతర్గత రహదారులు అన్ని వేళలా కిటకిటలాడుతుంటాయి. యాత్రికులు ఎక్కువగా సొంత వాహనాల్లో తిరుమలకు తరలివస్తుండడంతో ప్రధాన రహదారులు నిత్యం ట్రాఫిక్‌ సమస్యతో సతమతం అవుతుంటారు. అన్ని కూడళ్లలో ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకూ వాహనాలు బారులుదీరి కన్పిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవల నగర అభివృద్ధి సమీక్షలో ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించాలని అధికారులకు మార్గనిర్దేశం చేయడంతో తిరుపతి ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి పెడుతున్నారు.
 టెంపుల్ సిటీలో తీవ్రమవుతున్న ట్రాఫిక్ సమస్యకు త్వరితగతిన చెక్ పెట్టేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేయాలని స్థానికులు, భక్తులు కోరుతున్నారు. తిరుపతిని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్ది.. మరింతగా అభివృద్ధి చేయాలని విజ్ఞప్తిచేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14498
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author