భక్తుల దర్శనాలతో టీటీడీ రికార్డ్ 

 భక్తుల దర్శనాలతో టీటీడీ రికార్డ్ 
January 03 11:45 2018
తిరుమల,
వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయానికి భక్తులు పోటెత్తిన విషయం తెలిసిందే. ఈ రెండు రోజులు కలిపి రికార్డు స్థాయిలో 1.75 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం టీటీడీ కల్పించింది. డిసెంబరు 29న వైకుంఠ ఏకాదశి నాడు సప్తగిరులు భక్తులతో కిక్కిరిసిపోయింది. ఏకాదశి రోజు 74,012 మంది వైకుంఠద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. ద్వాదశి నాడు మునుపెన్నడూ లేనివిధంగా 1,01,246 మంది వైకుంఠద్వారం ద్వారా ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకున్నారు.. ఈ రెండు రోజుల్లో 1,75,258 మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పించి టిటిడి చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించింది. మునుపెన్నడూ లేనివిధంగా స్వామి దర్శనానికి భక్తులు తరలివచ్చారని టీటీడీ ప్రకటించింది.మరోవైపు జనవరి 24 న సూర్యజయంతి పురస్కరించుకుని తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. రథసప్తమి రోజున స్వామివారు ఒకే రోజున ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగుతారు కాబట్టి, ‘రథసప్తమి’ని ఒకరోజు బ్రహ్మోత్సవాలు, ఉప బ్రహ్మోత్సవాలని కూడా అంటారు.ఈ సందర్భంగా సూర్యప్రభ, చిన్నశేష, గరుడ, హనుమంత వాహనాలతో పాటు చక్రస్నానం అనంతరం కల్పవృక్ష, సర్వభూపాల, చంద్రప్రభ వాహనాలపై స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14529
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author