లేజర్ షో వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం

లేజర్ షో వ్యవహారంపై దర్యాప్తు ముమ్మరం
January 03 12:26 2018
విజయనగరం,
కొత్త సంవత్సరం సందర్భంగా ఓ ప్రైవేటు పాఠశాలలో ఏర్పాటు చేసిన లేజర్ షో విద్యార్థుల కొంపముంచింది. లేజర్ షో శ్రుతిమించడంతో సుమారు 200 మంది విద్యార్థులకు కంటి సమస్యలు వచ్చాయి. కళ్ల మంట, కన్నీరుతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. ఈ ఘటన విజయనగరం జిల్లా పార్వతీపురంలో చోటుచేసుకుంది. పార్వతీపురంలోని సురేష్‌ పాఠశాలకు అనుబంధంగా హాస్టల్‌లో ఉంటున్న విద్యార్థులు ఆదివారం రాత్రి న్యూ ఇయర్ వేడుకల్లో పాల్గొన్నారు. కొత్తసంవత్సరానికి విద్యార్థులంతా ఆహ్వానం పలికారు. తెల్లవారేంత వరకు కేరింతలు, ఆటాపాటలతో హంగామా చేశారు. ఆ తరవాత ఎవరి గదుల్లోకి వారు వెళ్లి నిద్రకు ఉపక్రమించారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందికి గురయ్యారు. లేద్దామంటే శరీరం సహకరించడంలేదు. కళ్లు విప్పారడంలేదు. ముఖం అంతా ఏదో పట్టేసిన భావన. ఎవరో వచ్చి.. తమ కళ్లను బలవంతంగా విప్పితే తప్ప తెరుచుకోవనే భయం. సోమవారం ఉదయం అంతా ఇదే పరిస్థితిలో కాలం గడిపారు. కొందరు ముందుగా తేరుకొని నేత్రవైద్యులను సంప్రదించారు. మిగిలిన వారంతా పాఠశాలకు వెళ్లకుండా వసతిగృహానికే పరిమితమయ్యారు. వసతిగృహంలో విద్యార్థులు బయటకు రాకపోయే సరికి పాఠశాలకు అనధికారిక సెలవును ప్రకటించారు. సాయంత్రానికి సమస్య తీవ్రత తెలిసింది. కంటి సమస్యతో తమ పిల్లలు బాధపడుతున్నట్లు తెలుసుకున్న తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకున్నారు. పిల్లల పరిస్థితి చూసి ఆందోళనకు దిగారు.ఈ సమస్య చివరకు పార్వతీపురం ఆర్డీవో బి.సుదర్శనదొర దృష్టికి వెళ్లింది. సిబ్బందితో అక్కడికి చేరుకున్న దొర పరిస్థితిని సమీక్షించారు. ప్రభుత్వ, ప్రైవేటు వైద్యులను పాఠశాల వద్దకు రప్పించి అక్కడే వైద్యశిబిరాన్ని ఏర్పాటుచేశారు. విద్యార్థులకు అవసరమైన మందులను కొనుగోలు చేయించి, వారికి నిరంతరం వైద్యసేవలు అందించాలని పాఠశాల యాజమాన్యానికి ఆదేశించారు. చల్లగాలిలో, దట్టంగా కురుస్తున్న మంచులో ఎక్కువ సేపు ఉండటం, దీనికి తోడు కళ్లు తట్టుకోలేనంత లేజర్ కాంతుల వల్ల పిల్లలు ఇబ్బంది పడినట్లు డాక్టర్లు వెల్లడించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14538
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author