గ్రేటర్ లో 3200 కోట్ల అభివృద్ధి పనులు : మంత్రి కేటీఆర్

గ్రేటర్ లో 3200 కోట్ల అభివృద్ధి పనులు : మంత్రి కేటీఆర్
January 03 15:52 2018
హైదరాబాద్,
హైదరాబాద్ నగరంలో రూ.23వేల కోట్లతో అభివృద్ధి పనులు చేస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం నాడు మాదాపూర్ అయ్యప్ప సొసైటీ చౌరస్తాలో అండర్ పాస్ రోడ్డును ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సుమారు 450 మీటర్ల పొడవైన  అండర్పాస్ను 9 నెలల్లో పూర్తి చేసిన అధికారులకు కేటీఆర్ అభినందించారు. నగరంలో మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ అండర్ పాస్ను పూర్తి చేయడానికి 12 నెలల సమయం ఉన్నప్పటికీ 9 నెలల్లోపే పూర్తి చేయడం జరిగిందన్నారు. ఎస్ఆర్డీపీని నాలుగు దశల్లో అమలు చేస్తున్నామని చెప్పారు. 110 కిలోమీటర్ల ఎలివేటర్ కారిడార్ నిర్మించడానికి ప్లాన్ చేస్తున్నామన్నారు.  నగరంలో రూ.3200 కోట్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. మరో రూ.3వేల కోట్ల అభివృద్ధి పనులకు టెండర్లు పిలవబోతున్నామని పేర్కొన్నారు. త్వరలో హైదరాబాద్ నగరంలో అన్ని రహదారులను అభివృద్ధి చేస్తామన్నారు. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం(ఎస్ఆర్డీపీ) తొలి దశ పనుల్లో భాగంగా ఈ అండర్ పాస్ను ప్రారంభించినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. మైండ్స్పేస్ వద్ద నిర్మాణంలో ఉన్న అండర్ పాస్ మార్చి వరకు పూర్తవుతుందన్నారు. మైండ్స్పేస్ జంక్షన్లో వచ్చే ఏడాది జూన్ నాటికి ైఫ్లె ఓవర్ నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. జూన్ నాటికి కామినేని జంక్షన్ ఫ్లై ఓవర్, మార్చి లేక ఏప్రిల్ నాటికి చింతలకుంట అండర్పాస్ నిర్మాణం పూర్తి చేస్తామని కేటీఆర్ చెప్పారు. అంబర్పేట ఫ్లై ఓవర్ 2019, సెప్టెంబర్ వరకు పూర్తవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, మంత్రి మహేందర్ రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14565
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author