ప్రభుత్వ ఆసుపత్రులలో మెరగయిన సేవలు

ప్రభుత్వ ఆసుపత్రులలో మెరగయిన సేవలు
January 03 16:08 2018
మచిలీపట్నం,
కృష్ణా జిల్లా  కైకలూరు మండలం చటాకాయ, మండవల్లి మండలం చింతపాడులో జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి డా.కామినేని శ్రీనివాస్ పాల్గొన్నారు.  కార్యక్రమంలో భాగంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు, అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్బంగా అయనమాట్లాడుతూ పండుగ రోజున పేదలు పస్తులు ఉండరాదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం “చంద్రన్న సంక్రాంతి కానుకలను” పంపిణీ చేస్తుందని అన్నారు. రాష్ట్రంలో గడిచిన మూడున్నరేళ్లలో వైద్య,ఆరోగ్య శాఖ పరంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వసతులను మెరుగుపరచడంతో పాటు వినూత్న పధకాలను ప్రవేశపెట్టడం జరిగింది. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు రోగే ప్రధమం అనే నినాధంతో పనిచేస్తున్నాయన అన్నారు. రాష్ట్రంలోని ప్రజలు ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండాలని ప్రభుత్వం అనేక ఆరోగ్య పధకాలను ప్రవేశపెట్టింది. ఎన్టీఆర్ వైద్య సేవ పధకం కింద రూ.3,934.69 కోట్లతో 14,08,063 చికిత్సల నిర్వహణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసామని అయన అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాలను ప్రోత్సహించేందుకు ఎన్టీఆర్ బేబి కిట్స్, తల్లిబిడ్డ ఎక్స్ ప్రైస్ తో పాటు త్వరలో మదర్ కిట్స్ కూడ ఇస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రులలో డయాలసీస్ చేయించుకొంటున్న వారికి ఫించన్లు ఇస్తున్నాం. ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజనుల కోసం ప్రత్యేకంగా  ఫిడర్ అంబులెన్సులు ఏర్పాటు చేసాం. గిరిజనులకు పౌష్టికాహారంతో పాటు మందులు అందిస్తున్నాంమని అన్నారు. చంద్రన్న సంచార చికిత్సలు, ముఖ్య మంత్రి పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ఆరోగ్య రక్ష, మహాప్రస్ధానం లాంటి కార్యక్రమాలు చేపట్టామని అయన అన్నారు.  కైకలూరు మండలంలో రూ. 28 కోట్ల పించన్లు, స్వయం ఉపాధి లోన్లు రూ.10 కోట్లు…డ్వాక్రా మహిళలకు లింకేజ్ లోన్ల కింద 80 కోట్లు ఇచ్చాం. కొల్లేటి కోట లోని పెద్దింట్లమ్మ ఆలయం అభివృద్ధికి 5 కోట్లు మంజూరు చేసామని అయన వెల్లడించారు. చటాకాయ గ్రామంలోని ఇద్దరు విద్యార్ధులకు ఐఐఐటి లో సీటు వచ్చిన సందర్భంగా వారిని మంత్రి కామినేని శ్రీనివాస్ అభినందించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14575
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author