జగన్ జీవితమంతా అబద్దాలమయం : మంత్రి ప్రత్తిపాటి

జగన్ జీవితమంతా అబద్దాలమయం : మంత్రి ప్రత్తిపాటి
January 03 16:12 2018
గుంటూరు,
గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం చెంఘీస్ ఖాన్ పేటలో జన్మభూమి-మాఊరు కార్యక్రమం లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పాల్గోన్నారు.  ఈ సందర్బంగా అయన రూ 1.5 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేసారు. మంత్రి మాట్లాడుతూ గత మూడున్నరేళ్లలో రాష్ట్రంలో వైద్య, ఆరోగ్య వసతుల పెంపునకు ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందని అన్నారు. అనేక వినూత్న పథకాలు ప్రవేశ పెట్టడం ద్వారా నిరుపేదలకు ప్రభుత్వం కార్పొరేట్ వైద్యాన్ని చేరువ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గత మూడున్నరేళ్లలో చేపట్టిన పథకాల వల్లే శిశు మరణాల రేటు, మాతా మరణాల రేటు గణనీయంగా తగ్గాయని అన్నారు. 2004-14 మధ్య కాలంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వాల నిర్వాకాలను దృష్టిలో ఉంచుకుని మైరుగైన పథకాలను సీఎం ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో కోటి 30 లక్షల పేద కుటుంబాలకు ఎన్టీఆర్ వైద్యసేవా ద్వారా 1,044 వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని మంత్రి అన్నారు. కిడ్ని రోగులకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ప్రతినెలా రూ. 2500 పెన్షన్లు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. అప్పట్లో ఆరోగ్య శ్రీని అవినీతిమయం చేయగా ప్రస్తుతం ఎన్టీఆర్ వైద్య సేవను అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని అయన వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డి జీవితమంతా అబద్దాలమయం. సిబిఐకి, ఈడికి అబద్దాలు చెప్పినట్టే రాష్ట్ర ప్రజలకు కూడా అబద్దాలు చెబుతున్నారని అయన ఆరోపించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14578
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author