అభివృద్దికోసం ఆదరించండి : సీఎం చంద్రబాబు

అభివృద్దికోసం ఆదరించండి : సీఎం చంద్రబాబు
January 03 18:52 2018
కడప,
కడప జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం పర్యటించారు.స్తున్నారు. పర్యటనలో భాగంగా లింగాల మండలం పార్నపల్లె వద్ద గండికోట-చిత్రావతి ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు పైలాన్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు గంగా మాతకు జలహారతి ఇచ్చి సారె సమర్పించారు. ఈ కార్యక్రమంలో  నీటి పారుదల శాఖ మంత్రి దే వినేని ఉమామహేశ్వరరావు, జిల్లా ఇంచార్జి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మార్కెటింగ్, గిడ్డంగులు,  పశుసంవర్ధక,మత్య, సహకారం శాఖ  మంత్రి సి ఆదినారాయణ,  ప్రభుత్వ విప్  మేడా మల్లికార్జున రెడ్డి , ప్రిన్సిపాల్ సెక్రటరీ శశి భూషణ్ కుమార్,  జిల్లా కలెక్టర్ టి.బాబురావు నాయుడు, డి ఐ జి శ్రీనివాసులు , జిల్లా ఎస్పీ బాబుజీ అట్టడా , మాజీ ఎంఎల్సీ మండలి ఉప చైర్మన్ సతీష్ రెడ్డి, ఇతర పార్టీ  నాయకులు, అధికారులు పాల్గోన్నారు. పార్నపల్లెలో జరిగిన బహిరంగసభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. కడప జిల్లాకు పరిశ్రమలు రాకపోవడానికి కారణం ఫ్యాక్షనిజమేనని అన్నారు.  ఇక్కడ ముఠా తగాదాలు ఉన్నాయన్న భావనతో ఫ్యాక్టరీలు ఏర్పాటుకు ఎవరూ ఆసక్తి చూపడం లేదని చెప్పారు. పులివెందులలో పార్టీ గెలవకపోయినా అభివృద్ధికి నిధులిచ్చామని చంద్రబాబు తెలిపారు. అభివృద్ధి జరగాలంటే టీడీపీను ఆదరించండి.. నాకు సహకరించండి అంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాయలసీమలో ఉద్యానవన పంటను ప్రోత్సహిస్తామని, సీమను ఉద్యానవన హబ్ గా చేస్తామని భరోసా ఇచ్చారు.
అంతకుముందు పులివెందులలో జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు  కార్యక్రమంలో మాట్లాడుతూ రూ.149లకే ఇంటర్నెట్, కేబుల్, టెలిఫోన్ సదుపాయం కల్పిస్తున్నామని సీఎం తెలిపారు.   మూడున్నరేళ్లలో మౌలిక సదుపాయాల కోసం రూ.15వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. ఆనందంగా పనిచేస్తే విసుగు అనేది రాదని చంద్రబాబు తెలిపారు. పరిసరాలను పరిశుభ్రంగా పెట్టుకోవడం అందరి బాధ్యత అన్నారు. 1100 నంబరుకు ఫోన్ చేస్తే ప్రజలు సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. నెలకు రూ. 10వేల ఆదాయం వచ్చేలా ప్రతి కుటుంబంపై శ్రద్ధపెడతామని హామినిచ్చారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14617
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author