మున్రో ప్రపంచ రికార్డ్

మున్రో ప్రపంచ రికార్డ్
January 03 19:22 2018
న్యూఢిల్లీ
న్యూజిలాండ్‌ బ్యాట్స్‌మన్‌ కొలిన్‌ మున్రో ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతర్జాతీయ టి20ల్లో మూడు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా నిలిచాడు. బే ఓవల్ వేదికగా, వెస్టిండీస్‌తో జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్ హిట్టర్ కాలిన్ మన్రో సెంచరీతో చెలరేగాడు. 47 బంతుల్లోనే శతకం పూర్తి చేసుకున్న మన్రో.. అంతర్జాతీయ టీ20ల్లో మూడో సెంచరీని ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన తొలి బ్యాట్స్‌మెన్‌గా రికార్డ్ నెలకొల్పాడు. ఈ మూడు సెంచరీలను మన్రో గత 12 నెలల్లోనే చేయడం అతడి దూకుడుకి అద్దం పడుతోంది.మార్టిన్ గప్టిల్ (33 బంతుల్లో 63), మన్రో (53 బంతుల్లో 104; 3×4, 10×6) మొదటి వికెట్‌కు 11.3 ఓవర్లలోనే 136 పరుగులు జోడించారు. వీరిద్దరు దూకుడుగా ఆడటంతో న్యూజిలాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 243 పరుగులు చేసింది. విండీస్ బౌలర్లలో బ్రాత్‌వైట్ రెండు వికెట్లు తీశాడు.వెస్డిండీస్‌తో జరుగుతున్న మూడో టి20 మ్యాచ్‌లో అతడీ ఘనత సాధించాడు. 47 బంతుల్లో 3 ఫోర్లు, 10 సిక్సర్లతో శతకం బాదాడు.మున్రో వీరవిహారం చేయడంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్‌ టీమ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 243 పరుగుల భారీ స్కోరు సాధించింది. న్యూజిలాండ్‌కు టి20ల్లో ఇదే అత్యధిక స్కోరు. 104 పరుగులు చేసిన మున్రో చివరి ఓవర్‌ మొదటి బంతికి అవుటయ్యాడు. 244 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్‌కు ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక్క పరుగుకే 2 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు వాల్టన్, క్రిస్‌ గేల్‌ డకౌటయ్యారు.  గతేడాది జనవరి 6న బంగ్లాదేశ్‌తో జరిగిన టి20 మ్యాచ్‌లో మున్రో (101) తొలి సెంచరీ కొట్టాడు. నవంబర్‌ 4న రాజ్‌కోట్‌లో భారత్‌తో జరిగిన మరో మ్యాచ్‌లో 109 పరుగులతో అజేయంగా నిలిచి రెండో శతకాన్ని సాధించాడు. తాజాగా మూడో సెంచరీ చేసి ఇంటర్నేషనల్‌ టి20 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా నిలిచాడు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14631
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author