రెండుగా విడిపోతున్న కాపు- బలిజ నేతలు

రెండుగా విడిపోతున్న కాపు- బలిజ నేతలు
January 04 12:31 2018
గుంటూరు,
 కాపుకార్పొరేషన్ పేరు-నిధులకు ఎసరొచ్చేలా ఉంది. ఇప్పటివరకూ కలిసి ఉన్న కాపు-బలిజల మధ్య గత కొద్దిరోజుల నుంచి దూరం పెరిగి, ఎవరి దారిన వారు ఉద్యమించాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో, ఇప్పుడు తమకూ ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటుచేయాలన్న డిమాండుకు బలిజలు పదునుపెడుతున్నారు. ఒకవేళ తమకు ప్రత్యేకంగా బలిజ కార్పొరేషన్ ఏర్పాటుచేయకపోతే, ప్రస్తుతం కొనసాగుతున్న కాపు కార్పొరేషన్‌నే రెండుగా చేసి, తమ వర్గానికి చెందిన నేతకు చైర్మన్ పదవి ఇవ్వాలన్న డిమాండును తెరమీదకు తీసుకురానున్నట్లు సమాచారం. దానితోపాటు ప్రస్తుతం కార్పొరేషన్‌కు ఇస్తున్న నిధులను కూడా జనాభా ప్రాతిపదికన విభజించి, కొత్తగా ఏర్పాటుచేసే బలిజ కార్పొరేషన్‌కు వాటిని పంపిణీ చేయాలని బలిజ నేతలు డిమాండ్ చేస్తున్నారు. కాపు-బలిజల కోసమే కార్పొరేషన్ ఏర్పాటుచేసినప్పటికీ, అందులో ఎక్కువ మంది కాపులకే రుణాలు అందుతున్నాయన్న అసంతృప్తే బలిజ కార్పొరేషన్ డిమాండుకు ప్రధాన కారణమని బలిజ నేతల మాటలు స్పష్టం చేస్తున్నాయి. తూ ర్పు-పశ్చిమ గోదావరిలో అధికంగా, కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని కొంత భాగం జనాభా ఉ న్న కాపులకు ప్రస్తుత కార్పొరేషన్ నిధులను ఆ జనాభా ప్రాతిపదికన కేటాయించి.. అనంతపు రం, చిత్తూరు, కర్నూలు, కడప, ప్రకాశం, నె ల్లూరు జిల్లాల్లో అధిక జనాభా ఉన్న తమ వర్గానికి మిగిలిన నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్న డిమాండును తెరపైకి తీసుకువస్తున్నారు.తమ డిమాండ్లను నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే వినిపించేందుకు బలిజ సంఘ నేతలు సిద్ధమవుతున్నారు. ఇప్పటివరకూ కాపు కార్పొరేషన్ ద్వారా కేవలం కోస్తాంధ్ర జిల్లాల్లోని కాపులు మాత్రమే లబ్థి పొందుతున్నారని, విదేశీవిద్య, ఇతర రుణాలు కూడా ఎక్కువగా వారికే అందుతున్నాయి తప్ప, రాయలసీమ బలిజలకు అంతంతమాత్రంగానే అందుతున్నాయని ఫిర్యాదు చేయనున్నారు. ప్రస్తుతం కాపు కార్పొరేషన్ కార్యాలయంతోపాటు, నిధులు కూడా జనాభా ప్రాతిపదికన రెండుగా చేసి, కొత్తగా బలిజ కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని కోరనున్నారు, ఇప్పుడు ఇస్తున్న నిధులనే జనాభా ప్రాతిపదికన వాడుకునేలా చర్యలు తీసుకోవాలని సీఎంను కోరనున్నారు.కాపు ఉద్యమంలో చీలికలు రావడం మంచిదికాదంటూ గుంటూరు జిల్లాకు చెందిన ఓ కాపునేత,  బలిజ నేత రమణ వద్దకు వెళ్లి చేసిన రాయబారం విఫలమయినట్లు సమాచారం. కాపు ఉద్యమంలో చీలికలు, కాపు-బలిజలు వేరుగా ఉద్యమించటం వల్ల నష్టపోతామని, ముద్రగడ చేస్తున్న ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని కాపు నేత బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే తాము గళం విప్పిన తర్వాత తమకు వ్యతిరేకంగా ముద్రగడ లేఖ రాయడం ఏమిటని రమణ నిలదీశారు. ముద్రగడ రెండురోజులకోసారి లేఖలు రాస్తుంటే మేమైనా అన్నామా? మేం రోడ్డెక్కి అవి మీడియాలో వస్తే మీడియావాళ్లను, మమ్మల్ని కుట్రదారులుగా చిత్రీకరించడమేమిటి? మీ వల్ల మాకు జరిగిన నష్టంపై నోరువిప్పితే చాలా నష్టం జరుగుతుంది. మాకు ప్రాధాన్యతాపరంగా బీసీల్లో చేర్పిస్తే అడ్డుకోవద్దని, మీ ఉద్యమానికి వ్యతిరేకం కాదని చెబుతున్నాం అని జవాబు ఇచ్చినట్లు తెలిసింది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14662
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author