సర్కార్ భూమినే అమ్మేశాడు

సర్కార్ భూమినే అమ్మేశాడు
January 04 12:46 2018
నత్తెనపల్లి,
ప్రభుత్వ భూమిని ఆక్రమించుకొని తప్పుడు సర్వే నంబర్లతో రిజిస్ట్రేషన్ చేయించి సుమారు రెండు ఎకరాలను ప్లాట్లగా విక్రయించిన సంఘటన సత్తెనపల్లిలో ఆలస్యంగా వెలుగుచూసింది. ఓ ప్రముఖ వ్యక్తి నమ్మకంగా పట్టణంలోని చాలామందిని నిమ్మించి ప్రభుత్వ స్థలాన్ని తన స్థలంగా అమ్మేశాడు ఆ ప్రబుద్ధుడు. అతని ఘరానా మోసం బయట పడేసరికి కొంత అప్పులు చేసి లక్షలు వెచ్చించి గత ఎనిమిది సంవత్సరాల క్రితం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకొని చివరకి ఇది ప్రభుత్వ భూమని ఇటీవల మున్సిపల్ అధికారులు పేద ప్రజలకు ఈ స్థలాన్ని కేటాయించడంతో అసలు నిజం బట్టబయలైంది. దీనితీ బాధితులు పోలీసుల్ని, లాయర్లని ఆశ్రయిస్తున్నారు. ఈ ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయడంలో సంబంధిత రిజిస్ట్రార్‌కి బారీగానే ముడుపులు ముట్టాయని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తెలిపిన వివరాలప్రకారం నందిగామ డొంక రోడ్డులోని సర్వే నెంబర్ 336-2 ఎకరాలను సత్తెనపల్లి పట్టణానికి చెందిన ఓ వ్యాపారి ఈ దారుణానికి వడికాట్టాడని బాధితులు వాపోయారు. మున్సిపల్ కమిషనర్ జి సాంబశివరావును సంప్రదించగా సదరు వ్యక్తి తప్పుడు సర్వే నంబర్లలో ఆ స్థలాన్ని విక్రయించాడని, ఇది ప్రభుత్వ స్థలమని ప్రభుత్వ అబివృద్ధి కార్యక్రమాలకు అడ్డుపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతో బాధితులు లబోదిబోమంటున్నారు. దీనిపై ప్రభుత్వం బాధితుల తరపున నిలబడి తగు న్యాయం చేయాలని కోరుతున్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14668
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author