భాగ్యనగర్ లో  ఇక వాల్ పోస్టర్లు కనిపించవు

భాగ్యనగర్ లో  ఇక వాల్ పోస్టర్లు కనిపించవు
January 04 13:07 2018
హైద్రాబాద్,,
గ్రేటర్ హైద‌రాబాద్ న‌గ‌రాన్ని ప‌రిశుభ్ర న‌గ‌రంగా తీర్చిదిద్దేందుకు జిహెచ్ఎంసి అధికారులు కఠినంగా వ్యవహారించనున్నారు. ఇప్పటికే నగర సుందరీకణలో చేప‌ట్టిన చ‌ర్యల్లో భాగంగా న‌గ‌రంలో విచ్చల‌విడిగా ఫ్లెక్సీలు, బ్యాన‌ర్లు, పోస్టర్లు, రాజకీయ కటౌట్లు క‌ట్టే విధానాన్ని నిషేధించారు.  అయితే నగరంలో ఈ నిబందనలు అమలు కావడం లేదు. ఈ నేపథ్యంలో కమీషనర్ జనార్ధన్ రెడ్డి రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో పాల్గొన్న రాజకీయ పార్టీల నేతలు  ప్రతిపక్షాలను అణిచివేసే చర్యలను సహించబోమని చెప్పడం ప్రస్తుతం చర్చీనీయాంశంగా మారింది… హైద‌రాబాద్ న‌గ‌రంలో సుందరంగా మార్చడానికి నగర పరిదిలో అనధికార వాల్ పోస్టర్లు..ఫెక్సీలు…కటౌట్లు పెట్టడాన్ని నియంత్రిస్తామంటున్నారు కమీషనర్ జనార్దన్ రెడ్డి.  ఇప్పటికే ఉన్న నిభందనలను అతిక్రమించిన వారిపై కొరడా ఝులిపింస్తామంటున్నారాయన. బల్దియా పరిదిలో  త్వరలో స్వచ్ఛ సర్వేక్షన్ తో నగర అందాన్ని తీర్చిదిద్దేందుకు ప్లాన్స్ చేశామని ఈ క్రమంలో నిబంధనలు ఉల్లంఘించేవారిపై మరింత కఠినంగా వ్యవహరిస్తామన్నారు కమిషనర్. ఫ్లెక్సీలు, పోస్టర్ల నిషేదానికి మంత్రి కేటీఆర్ సూచించిన విషయాలను అన్ని రాజకీయ పార్టీల సమావేశంలో కమీషనర్  వివరించారు. ఇందుకు అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ఆయన కోరారు.మేయర్, కమీషర్ బల్దియా అధికారులు పాల్గొన్న ఆల్ పార్టీ మీటింగ్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులు జిహెచ్ఎంసి తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలను అణిచివేసే చర్యల్లో బాగంగా ఈ ప్లాన్స్ వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. ఏడాది కిందట జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో అధికార టీఆర్ఎస్ పార్టీ అన్ని నిభందనలు అతిక్రమించి నగరంలో మంతి ఫ్రెక్సీలు ..బ్యానర్లు పెట్టీ నగరాన్ని గులభిమయంగా చేశారని మండిపడ్డారు. అఫ్పుడు లేని ఆంక్షలు ఇఫ్పుడు ఎందుకు తీసుకోస్తున్నారని కమీషనర్ ను ప్రశ్నించారు. పండుగలు….రాజకీయ సమావేశాల సమయంలో తాము తప్పుక అన్ని అనుమతులు తీసుకుని పోస్టర్లు..ఫ్లెక్సీలు, కటౌట్లు కడుతున్నామని స్పష్టం చేసారు. భవిష్యత్తులో కూడా ఇదే విధానాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసారు. కాగా సమావేశానికి హాజరైన సినిమా, నగర స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, బిజీపీ నగర శాఖ నాయకులు భిన్నభిప్రాయాలు వ్యక్తం చేసారు. సినిమా పరిశ్రమ మొత్తం అడ్వటైజింగ్ పెద్ద ఎత్తున చేయడం లేదని వాల్ పోస్టర్లు.ఫ్లెక్సీల విషయంలో స్పష్టమైన నిభందనలు పెట్టాలని సూచించారు. అయితే నగర ప్రజల సొంత ఇంటి గోడలపై ఏలాంటి అనుమతులు లేకుండా స్వచ్ఛంద సంస్థల పోస్టులు….వాల్ పెయింటిగ్స్ చేస్తే కఠినంగా వ్యవహరించాలని కమీషనర్ కు సూచించారు.ఇప్పటికే నగర పరిశుభ్రత కోసం అనేక నిభందలు ఉన్నా ఎక్కడ పటిష్టంగా అమలు కావడంలేదు. అయితే బల్దియాకు భారీ ఆధాయాన్ని ఆర్జించి పెడుతున్న అడ్వటైజింగ్ వేలాది మందికి ఉఫాది చూపిస్తోంది. అయితే దీన్ని అమలు కఠిన తరం చేసేముందు సాధ్యాసద్యాలపై ఓ సర్వే చేయించాలని కోరిన నేతలు, ప్రతినిధుల సూచనలు ఏ మేరకు అమలవుతాయో మరి….
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14677
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author