పట్టిసీమ ఎక్కడుందో జగన్ కు తెలుసా : ఉమ 

పట్టిసీమ ఎక్కడుందో జగన్ కు తెలుసా : ఉమ 
January 04 13:57 2018
అమరావతి,
ఈ ఏడాది పులివెందులలో సుమారు 4 మీటర్లు మేర భూగర్భజలాలు పెరిగాయి. రాయలసీమ వాసుల ఈ ఏడాది సంతోషంగా ఉన్నారని మంత్రి దేవినేని ఉమ అన్నారు. గురువారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. ఈ ఏడాది రాయలసీమ కి 123 టీఎంసీ లు నీళ్లు ఇచ్చాం.  జగన్మోహన్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నాడు. కాంగ్రెస్ హయాంలో మీరెందుకు పులివెందుల నీళ్లు తీసుకెళ్లలేకపోయారని అయన నిలదీసారు. సీఎం పదవి పిచ్చితో ఎన్నికైయిన నియోజకవర్గo ని కూడా జగన్ పట్టించుకోలేదు. 40 టీఎంసీ లు నీరు అందిస్తే చెంబుతో నీళ్లు పోశారు అని అపహాస్యంగా మాట్లాడుతున్నాడని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డికి ఇరిగేషన్ ప్రోజెక్టుల మీద అవగాహన లేదు. పట్టిసీమ ఎక్కడ ఉందో కూడా తెలీదు. ప్రతీ శుక్రవారం కోర్ట్ కెల్లే జగన్ కి పులివెందుల నీరు వస్తే కనీసం అక్కడికి చూసేందుకు వెళ్లే తీరిక లేదని అయన వ్యాఖ్యానించారు. త్వరలోనే రాయలసీమ లోని అన్ని ప్రోజెక్టులకు, రిజర్వాయిర్ కి దశల వారీగా నీరు ఇస్తాం. చంద్రబాబు అన్న మాట ప్రకారం పులివెందుల నీరు ఇచ్చారు. కుప్పం కంటే పులివెందులకే ముందు నీరు ఇచ్చామని మంత్రి అన్నారు.  పులివెందులలో రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ విజయం సాధిస్తుందని అయన జోస్యం చెప్పారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14712
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author