ప్రజల్లో అవగాహన పెరగాలి గ్రామాలు ఐకమత్యంగా ఉండాలి

ప్రజల్లో అవగాహన పెరగాలి గ్రామాలు ఐకమత్యంగా ఉండాలి
January 04 18:34 2018
శ్రీకాకుళం
శ్రీకాకుళం జిల్లా పర్యటనలో బాగంగా ఇచ్చాపురంలో ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రోడ్‌షో నిర్వహించారు. రోడ్ షోకు టీడీపీ శ్రేణుల భారీగా హాజరైయ్యారు. గవర్నమెంట్‌ కాలేజీ గ్రౌండ్‌లో జన్మభూమి సభను ఏర్పాటు చేశారు. వివిధ శాఖలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సీఎం పరిశీలించారు. జన్మభూమి సభలో చంద్రబాబు ప్రసంగిస్తూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలపై ప్రజల్లో అవగాహన పెరగాలి. గ్రామాలు ఐకమత్యంగా ఉండాలి. అభివృద్ధి కోసం ప్రజలు కలిసికట్టుగా పనిచేయాలి. వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. స్వచ్ఛతలో సింగపూర్ ఆదర్శంగా తీసుకోవాల ని సీఎం వ్యాఖ్యానించారు.మరుగుదొడ్లపై ప్రజల్లో అవగాహన పెరిగిందని సీఎం చెప్పారు. గతంలో బహిరంగ మల విసర్జనతో అవమానాలు ఎదుర్కొన్నారని, నా ఆడబిడ్డలను కష్టాల నుంచి విముక్తి కల్పించేందుకు వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టిస్తున్నామన్నారు. పట్టణ ప్రాంతాల్లో మరుగుదొడ్ల నిర్మాణం పూర్తయిందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మరుగుదొడ్లు నిర్మించుకుంటే రూ.15వేలు ఇస్తున్నామని, సెల్‌ఫోన్లపై ఉన్న ప్రేమ మరుగుదొడ్ల నిర్మాణంపై లేదన్నారు. మార్చి 31తేదీ లోపు అందరూ మరుగుదొడ్లు నిర్మించుకోవాలని సూచించారు. మరుగుదొడ్లు కట్టకపోతే మీ ఇంటికొచ్చి కూర్చుంటా. మౌన దీక్ష చేస్తానన్నారు.
జన్మభూమి-మా ఊరు స్ఫూర్తిదాయక కార్యక్రమం అని చెప్పారు. జన్మభూమి రుణం తీర్చుకోవటానికే ఈ కార్యక్రమం తలపట్టామని తెలిపారు. 16వేల గ్రామాల్లో జన్మభూమి కార్యక్రమం జరుగుతోందన్నారు. 35 కుటుంబాలకు ఒక డ్వాక్రా మహిళను ఇన్‌చార్జ్‌గా పెట్టామని చెప్పారు. పేదరిక నిర్మూలన నా ఆశయం. సమాజంలో అసమానతలు పోవాలన్నారు. మీ భవిష్యత్ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.రాష్ట్ర విభజన వల్ల అనేక కష్టాలు పడ్డాం. ఆర్థిక ఇబ్బందులున్నా సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. విభజన కష్టాల నుంచి అవకాశాలను వెతుక్కున్నాం. చంద్రన్న బాట కింద పెద్ద ఎత్తున రోడ్లను నిర్మిస్తున్నామని సీఎం వ్యాఖ్యానించారు.విద్యుత్ సమస్యలను అధిగమించాం. నాణ్యమైన కరెంట్‌ ఇస్తున్నాం. వీధి దీపాలన్నీ ఎల్ఈడీలుగా మారుస్తున్నాం. భవిష్యత్‌లో కరెంట్‌ చార్జీలు పెంచబోము. విభజన తర్వాత తీసుకున్న చర్యల కారణంగా ఏపీలో మిగులు విద్యుత్ సాధించగలిగాం. మహిళల కష్టాలు చూసి గ్యాస్ సిలెండర్లు ఇచ్చాం. కాంగ్రెస్ హయాంలో దీపాన్ని ఆర్పేశారు. ఇంటర్నెట్‌తో ఇల్లే విజ్ఞాన ఖనిగా మారుతోంద ని చంద్రబాబు వివరించారు.ఫైబర్ గ్రిడ్ ద్వారా మహిళలకు విజ్ఞానం పెరుగుతుందని, గర్భిణిలను గౌరవంగా ఇంటికి పంపించేందుకు తల్లి, బిడ్డ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించామన్నారు. ఇంటి పెద్ద చనిపోతే కుటుంబం అనాధ కాకూడదనే చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. గ్రామ పంచాయతీల్లో కూరగాయలు పండించే క్షేత్రాలు ఏర్పాటు చేశాం..ఆ కూరగాయలను గ్రామాల్లోని పిల్లలకు ఆహారంగా వినియోగిస్తామని ఆయన చెప్పారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14772
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author