విద్యుత్ ఘటన మాదే :  పొంగులేటి   

విద్యుత్ ఘటన మాదే :  పొంగులేటి   
January 04 21:43 2018
హైదరాబాద్,
24 గంటల విద్యుత్ సరఫరాపై కేసీఆర్ సర్కార్ దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంది. అసలు గత కాంగ్రెస్ ప్రభుత్వాల కృషి తోనే 24 గంటల విద్యుత్ సాధ్యమైందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. గురువారం అయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ గురించి  చెప్పకుండా కేసీఆర్ సర్కార్ స్వంత డబ్బా కొట్టుకొంటోంది. 24 గంటల విద్యుత్ పై కాంగ్రెస్ వాస్తవాలు చెప్పేందుకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే .. మంత్రి జగదీశ్వర్ రెడ్డి నోటికొచ్చినట్లు కాంగ్రెస్ పై విమర్శలు చేయడం సరికాదని అన్నారు. మంత్రిగా ఉంది ఇలా ఇష్టానుసారం మాట్లాడటం మంచిది కాదు.
విలువలు లేకుండా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడుతున్నాడని విమర్శించారు. డ్రయిరన్  ప్రొటెక్టర్ ను ప్రభుత్వం ఉచితంగా రైతులకు అందించాలి . ఆటోమేటిక్ స్టార్టర్స్ తొలగొంచాలి . వ్యవసాయ .. విద్యుత్ ఇష్యుస్ పై ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి సూచనలను తీసుకోవాలని అయన అన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల లోపే అఖిలపక్షాన్ని నిర్వహించాలిని డిమాండ్ చేసారు.
అధికార పార్టీ నేతల వత్తిడి తోనే ప్రభుత్వం ఐఏఎస్ అధికారులను బదిలీలు చేసింది  టిఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమాలను అడ్డుకుందుకే సీఎం ఐఏఎస్ అధికారులకు బదిలీ గిఫ్ట్ ఇచ్చారని పొంగులేటి విమర్శించారు. ఇది సరైన విధానం కాదని అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పై ఎన్నిక హామీ ఇచ్చిన కేసీఆర్ ప్రబుత్వం ఇప్పుడు దాన్ని గాలికొదిలేసిందని అన్నారు. అసెంబ్లీ లో ఈ అంశాన్ని లేవనెత్తితే మా గొంతు నొక్కుతున్నారు .
కేసీఆర్ దళిత వ్యతిరేకి.  మందకృష్ణ అరెస్ట్,  జైళ్లలో పెట్టడం అప్రజాస్వామికమని ఆరోపిపంచారు. మందకృష్ణను బేషరతుగా విడుదల చేయాలి. మందకృష్ణను జైల్లో పుడితే మాదిగ జాతి సహించదని హెచ్చరించారు. కేసీఆర్ ను రేపు గద్దె దించేది కూడా మాదిగ జాతే అన్న విషయాన్ని కేసీఆర్ గ్రహించాలని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14784
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author