బెజవాడ దుర్గగుడిలో ఏం జరుగుతోంది

బెజవాడ దుర్గగుడిలో ఏం జరుగుతోంది
January 05 11:46 2018
విజయవాడ,
బెజవాడ కనకదుర్గ గుడిలో తాంత్రిక పూజల పై అనుమానాలు బలపడుతున్నాయి. ఆలయంలో అర్థరాత్రి క్షుద్రపూజలు నిర్వహించింది నిజమేననే చర్చ సాగుతోంది. సృజన్ అనే అర్చుకుడు  ఈ పూజలు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అతనుపోలీసుల అదుపులో ఉన్నారంటున్నారు. మొత్తం ముగ్గురు అర్చకులను ప్రశ్నించిన పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. దుర్గగుడిలో అర్థరాత్రి పూజలు నిజమేనని పూజారి రాజా ఒప్పుకున్నాడంటున్నారు. పూజలో భాగంగా అమ్మవారి కవచం తీసి ఐదు చీరలతో అలంకరించినట్టు రాజా చెప్పారట. అంతే కాదు..పూజ ముగిశాక అంతరాలయానికి తాళం వేసేవరకూ తాము ఉన్నట్లు ఆయన చెప్పారంటున్నారు. పూజ అయిన తర్వాత కూడ వారు రాత్రి అక్కడే బసచేసి వెళ్లినట్టు అర్థమవుతోంది. తనతో పాటు మరొకరు కూడా పూజలో పాల్గొన్నట్టు అతను చెప్పారంటున్నారు.దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై తమ నివేదికను పోలీసులు ఉన్నతాధికారులకు పంపారు. ఆలయ శుద్ధి విషయంలోను అనుమతులు తీసుకోవడంతో సందేహాలు ముసురుకుంటున్నాయి. అసలు ఈ వ్యవహారంపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహంతో ఉందంటున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో మరోవైపు ఉన్నతాధికారులు మాట్లాడారు. ఈ విషయంలో ఏం జరిగిందో చంద్రబాబుకు వారు వివరించారు. దుర్గగుడిలో తాంత్రిక పూజలపై న్యాయవాదులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజా, సృజన్, ప్రణవ్‌ అనే పూజారులు ఇందులో పాల్గొన్నారని చెబుతున్నారు. అసలు దుర్గగుడికి సంబంధం లేని వ్యక్తులు ఎందుకు అక్కడకు వచ్చారు. పూజలు ఎందుకు చేశారనేది తేలలేదు. ప్రధాన అర్చకుడు బదరీనాథ్‌కు సహాయకులుగా వచ్చారని చెబుతున్నా..అది నిజం కాదని తేలుతోంది. మరోవైపు దుర్గగుడిలో తాంత్రిక పూజలపై అంతర్గత విచారణకు ఈవో సూర్యకుమారి ఆదేశించారు. విచారణాధికారిగా ఈఈ వెంకటేశ్వరరాజు నియమించడంతో అసలు ఏం జరిగిందో తెలిసే అవకాశముంది. ఆలయ అర్చకులు, స్థానాచార్యులు, పూజారులతో ఈవో సూర్యకుమారి పలు దఫాలుగా మాట్లాడారు. ఇంకోవైపు సీఎం చంద్రబాబుతోను దేవాదాయ శాఖ మంత్రి మణిక్యాలరావు భేటీ అయ్యారు. దుర్గగుడిలో అర్థరాత్రి పూజల వ్యవహారంపై చర్చిస్తున్నారు. దుర్గగుడిలో తాంత్రిక పూజల వ్యవహారంపై మంత్రి మాణిక్యాలరావు సీఎం చంద్రబాబుకు చెప్పారట. ఈ ఘటనపై ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. ప్రాథమిక దర్యాప్తు నివేదికను సీపీ గౌతమ్‌సవాంగ్‌ సీఎంకు ఇప్పటికే అందజేశారు. శుక్రవారం లోపు వారు పూర్తిస్థాయి నివేదికతో రావాలని సీపీ గౌతమ్‌సవాంగ్‌ను సీఎం చంద్రబాబు ఆదేశింశారు.దుర్గగుడిలో అర్థరాత్రి పూజలు జరిగే ఆస్కారమే లేదని మంత్రి మాణిక్యాలరావు బుకాయిస్తున్నాడు. అంతరాలయాన్ని శుద్ధి చేయడం.. అలంకరణ వరకే ఇది జరిగిందని ఆయన చెబుతున్నారు. బయట వ్యక్తులు ఆలయంలోకి రావడం అభ్యంతరకరమే అని చెప్పారు. పూర్తి స్థాయి విచారణ కోసం దేవాదాయ శాఖ తరపున నిజ నిర్ధారణ కమిటీ వేస్తున్నట్లు మంత్రి చెప్పారు. ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా జరిగితే సహించేది లేదని ఆయన అన్నారు. ఇంతకంటే మంచి అవకాశం రాదనుకున్న వైసీపీ నేతలు, టీడీపీ, సి.ఎం చంద్రబాబు, నారా లోకేష్ పై విమర్శల దాడి మొదలు పెట్టింది. సి.ఎంగా లోకేష్ ను కూర్చోపెట్టేందుకే ఈ తాంత్రిక పూజలు చేయించారని ఆరోపించింది. ఫలితంగా ఇప్పుడు వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేదు. ప్రభుత్వం వైపు తప్పు ఉన్నా..బయటకు వచ్చే వీలు లేదని తెలుస్తోంది. తప్పు లేకపోయినా వైకాపా విమర్శించడం మానుకోదు. మొత్తంగా జనాల్లో ఇప్పుడు దుర్గగుడి విషయం నానుతోంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14817
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author