ఎస్‌బీఐ లో కనీస నగదు నిల్వ రూ.1000కి తగ్గింపు!

ఎస్‌బీఐ లో కనీస నగదు నిల్వ రూ.1000కి తగ్గింపు!
January 05 13:08 2018
న్యూ డిల్లీ
కనీస నగదు నిల్వ విషయంలో  ప్రభుత్వం నుంచి తీవ్ర ఒత్తిడి వస్తుండడంతో భారతీయ స్టేట్ బ్యాంకు (ఎస్‌బీఐ) ఈ విషయాన్ని సమీక్షించాలని నిర్ణయించింది. పట్టణాల్లో రూ.3 వేలుగా ఉన్న కనీస నగదు నిల్వ నిబంధనను వెయ్యి రూపాయలకు తగ్గించాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
గతేడాది ఏప్రిల్-నవంబరు మధ్య కనీస నిల్వను పాటించని ఖాతాదారుల నుంచి రూ.1,772 కోట్లు వసూలు చేసినట్టు తాజాగా ఎస్‌బీఐ ప్రకటించింది. అయితే అంతలోనే ఈ నిర్ణయం తీసుకోవడం వెనక ప్రభుత్వ ఒత్తిడి ఉందని సమాచారం. ప్రస్తుతం ఉన్న కనీస నగదు నిల్వ నిబంధనను రూ.1000కి తగ్గించాలని నిర్ణయించింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.గతేడాది జూన్‌లో ఎస్‌బీఐ కనీస నగదు నిల్వను రూ.5 వేలకు  పెంచింది. ఖాతాదారుల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు రావడంతో మెట్రో నగరాల్లో రూ.3 వేలు, సెమీ అర్బన్ ప్రాంతాల్లో రూ.2 వేలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1000 కనీస నగదు నిల్వ ఉండాలంటూ ఆదేశాలు జారీ చేసింది. అంతకు మించి తగ్గితే ఆయా ప్రాంతాలను బట్టి జరిమానా కింద  రూ.25 నుంచి రూ.100 వసూలు చేయనున్నట్టు ప్రకటించింది.
తాజాగా మినిమమ్ బ్యాలెన్స్ విధానంపై సమీక్ష జరపాలని, కనీస నగదు నిల్వను రూ.1000కు  తగ్గించాలని నిర్ణయించింది. అయితే బ్యాంకు అధికారులు మాత్రం ఈ విషయంపై ఇప్పటి వరకు పెదవి విప్పడం లేదు. కనీస నగదు నిల్వలేని ఖాతాలపై అపరాధ  రుసుము విధించడం ద్వారా ప్రభుత్వ రంగ స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు రూ.1771కోట్లు వచ్చాయి. 2017 ఏప్రిల్‌-నవంబరు మధ్య ఆయా ఖాతాల నుంచి ఎస్‌బీఐ ఈ ఛార్జీలను వసూలు చేసిందని నివేదికల ద్వారా వెల్లడైంది. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో కనీస నగదు నిల్వ (మినిమమ్‌ బ్యాలెన్స్‌) ఉండాలి. అలా లేకపోతే ఏ బ్యాంకు అయినా కచ్చితంగా రుసుములు వసూలు చేస్తుంది. జులై-సెప్టెంబరు త్రైమాసికానికి బ్యాంకు నికర లాభం రూ.1,581.55 కోట్ల కన్నా ఇది ఎక్కువ కాగా, ఏప్రిల్‌-సెప్టెంబరు మధ్య వచ్చిన నికరలాభం రూ.3,586 కోట్లలో సగం రుసుముల ద్వారా వచ్చినట్లైంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14835
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author