శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం

శంషాబాద్ ఎయిర్ పోర్టులో బంగారం స్వాధీనం
January 05 13:25 2018
హైదరాబాద్,
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో శుక్రవారం నాడు కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఒక  ప్రయాణికురాలి వద్ద 353 గ్రాముల అక్రమ బంగారం పట్టుబడింది. బంగారాన్ని  స్వాధీనం చేసుకున్న కస్టమ్స్ అధికారులు నిందితురాలిని విచారిస్తున్నారు.
దుబాయి నుండి హైద్రాబాద్ వస్తున్న ప్రయాణికురాలు  అక్రమ  బంగారాన్ని ఏవరికి  అనుమానం రాకూడదని గాజులుగా మార్చి చేతులకు వేసుకుని వచ్చింది.  ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ ఆధికారులకు అనుమానం వచ్చింది. దీంతో నిందితురాలిని ప్రశ్నించడం మొదలు పెట్టారు. దీంతో బండారం బట్టబయలయింది. బంగారాన్ని స్వాధీనం చేసుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.  బంగారం విలువ 11 లక్షల వరకు ఉంటుందని అంచనా.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14844
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author