ఏప్రిల్ నెల సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ

 ఏప్రిల్ నెల సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ
January 05 13:41 2018
తిరుమల,
వచ్చే ఏప్రిల్ మాసానికి సంబంధించిన 56593 సేవా టిక్కేట్లును ఆన్ లైన్ లో టీటీడీ శుక్రవారం విడుదల చేసింది.  సుప్రభాతం సేవ 7878, తోమాల సేవా 120,అర్చన 120, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం 2300, విశేష పూజ 1875, కళ్యాణోత్సవం 11250, ఉంజల్ సేవా 3000, బ్రహ్మోత్సవం 5805, వసంతోత్సవం 11180, సహస్ర దీపాలంకరణ సేవా 12825 టికెట్లు విడుదల చేసారు. ఈ సందర్బంగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ సర్వదర్శనం భక్తులుకు మార్చి మూడో వారం నుండి పూర్తి స్థాయిలో టైం స్లాట్ విధానం ప్రవేశపెడతామని ప్రకటించారు.   ఈ నెల 9,29 వ తేదిలలో వయోవృద్దులు, వికలాంగులుకు ప్రత్యేక దర్శన సౌకర్యం, 10,30 వ తేదిలలో చంటి బిడ్డల తల్లితండ్రులుకు ప్రత్యేక దర్శనం కల్పిస్తామని అయన అన్నారు. ఎన్నడూ లేని విధంగా వైకుంఠం ద్వార దర్శనంను ఈ ఏడాది లక్షా 75 వేల మంది భక్తులుకు కల్పించామని అయన అన్నారు. ఈ నెల 24వ తేదిన రథసప్తమి వేడుకలు వేడుకగా నిర్వహిస్తామని అన్నారు.  డిసెంబర్ మాసంలో 22.59 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారు.  హుండి ఆదాయం 91.56 కోట్లు వచ్చింది. 92 లక్షల లడ్డులు భక్తులుకు అందజేసామని ఈవో తెలిపారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14850
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author