రియల్ ఎస్టేట్ సమస్యలు పరిష్కారిస్తాం :లోకేష్ 

రియల్ ఎస్టేట్ సమస్యలు పరిష్కారిస్తాం :లోకేష్ 
January 05 14:39 2018
విజయవాడ,
రాష్ట్ర విభజన సమయంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నామని మంత్రి లోకేష్ అన్నారు. శుక్రవారం నాడు విజయాడ ఏ కన్వేన్షన్ సెంటర్  లో క్రెడాయ్ ఐదవ ప్రాపర్టీ షోను అయన ప్రారంభించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ  రాష్ట్ర విభజన జరిగిన ఈ మూడున్నరేళ్లలో సమస్యలను ఒక్కటొక్కటిగా పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నామని అన్నారు. విభజన సమయంలో మన దగ్గర నిధులు లేవు, సమయం లేదు. మూడున్నర ఏళ్లుగా ఒక్కో సమస్యను పరిష్కారిస్తూ ప్రజా రాజధాని ఏర్పాటు చేసుకోబోతున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఒక్క రూపాయి లేక పోయినా అమరావతి ప్రాంత రైతులు రాజధాని నిర్మాణం కోసం 35 వేల ఎకరాలు ఇచ్చారు.వారికి నా కృతజ్ఞతలని అన్నారు. ముఖ్యమంత్రి  అన్ని జిల్లాలు సమానంగా అభివృద్ధి చెందాలి అని కార్యాచరణ రూపొందించారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఐటీ కంపెనీలు, ఫార్మా, మెడికల్ ఉత్పత్తులు తయారీ కంపెనీలు వస్తున్నాయి.  రాజధాని లో ఐటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కంపెనీలు వస్తున్నాయని అన్నారు. రాయలసీమ జిల్లాలో తయారీ రంగ కంపెనీలు వస్తున్నాయి. ఐ టి లో లక్ష,ఎలక్ట్రానిక్ తయారీ రంగంలో 2 లక్షల  ఉద్యోగాలు కల్పించాలి అని ముఖ్యమంత్రి చంద్రబాబు మార్గనిర్దేశం చేసారని లోకేష్ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో మన రాష్ట్రంలో ఒక్క మొబైల్ ఫోన్ కూడా తయారు కాలేదు. కానీ ఇప్పుడు దేశంలో తయారు అవుతున్న 10 ఫోన్లలో 2 ఆంధ్రప్రదేశ్ లో తయారు అవుతున్నాయని అన్నారు. 2019 కి దేశంలో తయారు అయ్యే 10 ఫోన్లలో 5 ఆంధ్రప్రదేశ్ తయారు అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అయన వెల్లడించారు.
ఈ నెల 13 న తిరుపతి లో 8 ఐటీ కంపెనీలను ప్రారంభించబోతున్నాను. ఐటి అంటే కేవలం పెద్ద కంపెనీలు మాత్రమే కాదు. చిన్న,మధ్య తరగతి కంపెనీలు కూడా రాష్ట్రానికి వచ్చినప్పుడే పూర్తి స్థాయి ఎకో సిస్టమ్ ఏర్పడుతుందని అయన  న్నారు. అలాగే హెచ్సిఎల్ , కాన్డ్యూయెంట్, జోహో, గూగుల్ ఎక్స్, ఫ్రాంక్లిన్,  ఏఎన్ఎస్ఆర్ లాంటి పెద్ద కంపెనీలు త్వరలోనే తమ కార్యకలాపాలు ప్రారంభించబోతున్నాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో రియల్ ఎస్టేట్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుంది.  రియల్ ఎస్టేట్ డేవలపర్స్ ఎదుర్కుంటున్న సమస్యలు పరిష్కారం కోసం క్రెడాయ్ తరపున వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చెయ్యాలి…సమస్యలు మా దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. రియల్ ఎస్టేట్ డేవేలపర్స్ కు ఉన్న సమస్యల పై నాకు పూర్తి అవగాహన ఉంది. ఒక ఇల్లు కట్టడం ఎంత కష్టమో నాకు తెలుసని అన్నారు. నాలా టాక్స్ కు సంబంధించి ఫైల్ గవర్నర్ గారి దగ్గర పెండింగ్ లో ఉంది అది కూడా త్వరలోనే పరిష్కారం అవుతుందని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14861
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author