త్వరలో విఐపీ దర్శనాల టికెట్లు పెరుగుదల..

త్వరలో విఐపీ దర్శనాల టికెట్లు పెరుగుదల..
January 05 16:33 2018
తిరుమల,
తిరుమలలో విఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లు పెంచాల్చిన అవసరం ఉందని టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ స్సష్టం చేశారు. ఎప్పుడో గత 10 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన రేట్లు ఇంకా అమలులో ఉన్నాయని… కాలానుగుణ మార్పులు…. భక్తుల అవసరాల దృష్యా రేట్లు పెంచక తప్పదని స్ఫష్టం చేశారు. అయినా బ్రేక్ దర్శనాల్లో రేట్లు పెంచిన మాత్రాన సామాన్యుల పై భారం ఏ మాత్రం పడదని పేర్కొన్నారు. త్వరలో విది విధానాలు ప్రకటిస్తామన్నారు ఈఓ.
 అన్యమతస్థుల ఉద్యోగులపై  కఠిన చర్యలు.
వెంకన్న సన్నిధీలో  అన్యమత ప్రచారం చేసే ఉద్యోగుల పైనే కాదు,  అన్యమతస్థులుగా ఉండి టీటీడీలో ఉద్యోగాలు పొంది విధులు నిర్వహిస్తున్న 44 మంది ఉద్యోగుల పై అతి త్వరలో కఠిన చర్యలు తీసుకోబోతునట్టు  ఈఓ  పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో పూర్తి వివరాలు సేకరించినట్టు ఈఓ స్పస్టం చేశారు. విజిలెన్స్ రిపోర్టు ఆదారంగా ఉద్యోగులను టీటీడీ నుండి శాశ్వతంగా తొలగించే ప్రక్రియ మొదలు పెట్టినట్టు ఈఓ అన్నారు. అయితే ఈ ఉద్యోగులను ఏ విధంగా టీటీడీ నుండి బయటకు పంపాలి. అలా పంపితే వచ్చే లీగల్ ఇబ్బందులు లేంటి అనే విషయాల పై దృష్టి సారించినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సైతం నివేదిన ఇచ్చినట్టు ఈఓ అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14869
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author