జూన్ వరకు ఎల్బీనగర్ మెట్రో :  కేటీఆర్

జూన్ వరకు ఎల్బీనగర్ మెట్రో :  కేటీఆర్
January 05 17:03 2018
హైదరాబాద్,
రికార్డు సమయంలో హైదరాబాద్ ప్రజల నీటి కష్టాలను తీరుస్తున్నామని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో ఎండకాలం వచ్చిందంటే ఖైరతాబాద్లోని జలమండలి ఆఫీసు ముందు ఖాళీ బిందెల ప్రదర్శన జరిగేదని అయన  గుర్తు చేసారు. శుక్రవారం నాడు ఎల్బీ నగర్ లోని సాహెబ్ నగర్ లో వాటర్ రిజర్వాయర్ ని  మంత్రి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెలేలు ఆర్. కృష్ణయ్య, తీగల కృష్ణారెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ ఇతర అధికారులు పాల్గోన్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కానీ ఇప్పుడు  రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తున్నాం. మహానగరంలో నీటి ఎద్దడి తీర్చేందుకు రూ. 2 వేల కోట్లతో తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ప్రజలకు మేలు చేసే విషయంలో, అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా నిధులు కేటాయిస్తున్నాం. మూసీని కూడా సుందరీకరిస్తాం. ఎల్బీనగర్ సామాన్యమైన నేల కాదు. తొలి అమరుడు శ్రీకాంతాచారి ఇక్కడే ఆత్మహత్య చేసుకున్నారని గుర్తు చేసారు. ఎల్బీనగర్ త్యాగాల గడ్డ. ఈ ప్రాంతం నుంచే అద్భుతమైన ఉద్యమాలు జరిగాయి. ఈ గడ్డను సీఎం కేసీఆర్ ఎప్పటికీ మరిచిపోలేరని అన్నారు. తెలంగాణ వస్తే కరెంటే ఉండదు. పరిశ్రమలు పారిపోతాయి. పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ రారు అని కిరణ్కుమార్రెడ్డి భయపెట్టారు. కానీ ఈ మూడున్నర సంవత్సరాల కాలంలో తెలంగాణ ఎంతో అభివృద్ధి చెందింది.  వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. జూన్ వరకు ఎల్బీ నగర్ మెట్రో ప్రారభిస్తామని కేటీఆర్ వెల్లడించారు.
ఎంపీ మల్లారెడ్డి మాట్లాడుతూ దేశంలోనే నెంబర్ వన్ సీఎం కెసిఆర్. దేశంలో నెంబర్ వన్ సిటీ హైదరాబాద్. నెంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 325 కోట్లతో ఎల్బీ నగర్ నియోజకవర్గంలో రిజర్వాయర్ ప్రారంభిస్తున్నాం. ఎల్బీ నగర్ లో ట్రాఫిక్ కష్టాలు తీరిపోయాయని అన్నారు. మంత్రి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లాలో 200 కోట్లతో ఇంటింటికి మంచి నీటిని అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తుంది ప్రభుత్వమని అన్నారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14885
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author