ముక్కంటి ముందు తాంత్రిక పూజలు

ముక్కంటి ముందు తాంత్రిక పూజలు
January 05 20:22 2018
చిత్తూరు,
శ్రీకాళహస్తీశ్వరాలయం సూపరింటెండెంట్‌ను సస్పెండ్ చేస్తూ ఈవో భ్రమరాంబ నిర్ణయం తీసుకున్నారు. ప్రసాదాలు, విరాళాల కౌంటర్లలో నిబంధనలకు విరుద్ధంగా నిధుల వినియోగంపై ఆరోపణలు వచ్చాయి. దీంతో పాటు కాలభైరవుని ఆలయంలో స్వయంగా పూజలు నిర్వహించారనే ఆరోపణలు వెళ్లెవెత్తాయి. ఈ పరిణామాలమధ్య సూపరింటెండెంట్ ధన్‌పాల్‌పై సస్పెన్షన్ వేటు పడింది.విజయవాడ దుర్గగుడిలో తాంత్రిక పూజలు వివాదం నడుస్తుండగా… శ్రీకాళహస్తి ఆలయంలో కూడా క్షుద్రపూజలు జరిగాయంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సూపరింటెండెంట్ ధన్‌పాల్‌‌ను ఈవో భ్రమరాంబ సస్పెండ్ చేశారు. గతంలో ఆయనపై అవినీతి ఆరోపణలు రాగా సస్పెండ్ చేశారు. మళ్లీ విధుల్లోకి తీసుకున్నారు. ఇప్పుడు మళ్లీ ధన్‌పాల్‌‌పై విమర్శలు రావడంతో సస్పెండ్ చేశారు. ఎందుకు సస్పెండ్ చేశారన్నదానిపై ఈవో మాట్లాడలేదు. శ్రీకాళహస్తికి అనుబంధంగా కాలభైరవ ఆలయం ఉంది. ఆ ఆలయంలో అర్ధరాత్రి పూజలు నిర్వహించిన వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో ధన్‌పాల్ ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై ఈవో విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో ధన్‌పాల్‌ను సస్పెండ్ చేయడం చర్చనీయాంశమైంది.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14943
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author