గవర్నర్ తో టీపీసీసీ నేతల వాగ్వాదం

గవర్నర్ తో టీపీసీసీ నేతల వాగ్వాదం
January 05 20:39 2018
హైదరాబాద్,
రాష్ట్ర  గవ ర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ను శుక్రవారం నాడు టీపీసీసీ నేతలు కలిశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక మాఫియా అరాచకాలు,  మందకృష్ణ మాదిగ అరెస్టు విషయాలపై అయనకు విజ్ఞప్తి చేశారు. గవర్నర్ మాట్లాడుతూ ఇసుక మాఫియా పై తప్పుడు సమాచారం ఇస్తున్నారని అన్నట్లు సమాచారం. దీంతో గవర్నర్ కు కాంగ్రెస్. నేతలకు మద్య తీవ్ర వాగ్వివాదం జరిగినట్లు వార్తలు వచ్చాయి. అలాగే, ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ అలా చేసి ఉండాల్సింది కాదని అన్నట్లు సమాచారం.
గవర్నర్ ఇలా వ్యాఖ్యలు చేయడంతో కాంగ్రెస్ నేతలు తీవ్రంగా స్పందించారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీకు తెలుసా అంటూ గవర్నర్  పై  ఆగ్రహం వ్యక్తం చేశారు టీ కాంగ్రెస్ నేతలు. సోనియా దయవల్ల భిక్షతో  గవర్నర్ అయ్యారని అన్నారు.  మాదిగ-మాలలు అంటే ఇంత చిన్నచూపా..అంటూ మాజీఎంపీ సర్వే సత్యనారాయణనిలదీసినట్లు సమాచారం.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14958
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author