కడప జిల్లా రైతులకు కంటి మీద కునుకు కరువు

కడప జిల్లా రైతులకు కంటి మీద కునుకు కరువు
January 06 11:17 2018
కడప,
అతివృష్టి, అనావృష్టితో ఇన్నాళ్లు ఇబ్బందులు పడ్డ కడప రైతులకు ఇప్పుడు మరొక కష్టం వచ్చి పడింది. చేతికి వచ్చిన పంట కళ్లముందే నోటి దగ్గరకు రాకుండా పోతోంది.
కడప జిల్లా కేంద్రానికి సమీపంలో ఉన్న చింతకొమ్మదిన్నె మండలంలో రైతులకు కొన్ని నెలలుగా కంటి మీద నిద్ర కరువయ్యింది. పంటను కాపాడుకోవడాని రైతులు ఇబ్బందులు అన్ని ఇన్ని కావు. పగలూ రాత్రి అన్న తేడా లేకుండా రైతులు పంటలను రక్షించుకోవడానికి పొలాల వద్ద కాపలకాస్తున్నారు. జింకలు, అడవిపందుల నుంచి పంటల రక్షణ వారికి కత్తిమీద సాములాగా తయారైంది. కడప ఎయిర్ పోర్ట్ లో ఒకప్పుడు వందలాది జింకలు ఉండేవి. ఎయిర్ పోర్ట్ అధికారులు జింకలను బయటకు తోలేశారు. రక్షణ చర్యల నిమిత్తం ఎయిర్ పోర్ట్ అధికారులు తీసుకున్న చర్యలు రైతులకు శాపంగా మారాయి.ఎయిర్ పోర్ట్ పరిసర ప్రాంతాలలో రైతులు వేలాది ఎకరాలలో పత్తి, వేరు శనగ, బుడ్డ శనగ, కందితో పాటు పలు పంటలను సాగుచేస్తున్నారు. మొలక దశలోనే సగం పంట అడవి జంతువుల వల్ల పాడైపోతోంది. మిగిలిన సగం పంటను అడవి జంతువులు కాపు దశలో నష్టపరుస్తుండటంతో రైతు పెట్టిన పెట్టుబడితో పాటు శ్రమ కూడా జింకల పాలు అవుతోంది. దీంతో రైతు కష్టాల ఊబిలో కూరుకుపోతున్నాడు. మరో వైపు అటవీశాఖ అధికారుల వైఖరి కూడా రైతులను మరింత ఆందోళనకు గురిచేస్తోంది. రైతులు అడవి జంతువుల నుంచి పంటను రక్షించుకోవడానికి ఏర్పాటు చేసుకోనే రక్షణ చర్యల వల్ల జంతువులు మరణిస్తే రైతులపై అటవీ అధికారులు అనేక కేసులు నమోదు చేస్తున్నారు. అదే పంట నష్టపరిహారం విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారని రైతులు భాదపడుతున్నారు.ఎయిర్ పోర్ట్ తమ గ్రామానికి వచ్చిందని ఆనందపడ్డాలో లేక అందులోని జింకల వల్ల జరుగుతున్న నష్టానికి బాధపడాలో అర్ధం కాలేదని రైతులు ఆందోళన వ్యక్తం
 చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=14965
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author