జగన్ యాత్రకు మైలేజ్ ఎక్కడ

జగన్ యాత్రకు మైలేజ్ ఎక్కడ
January 06 14:04 2018
తిరుపతి,
జగన్ పాదయాత్రకు ప్రచారం రావడం లేదని తెగ మదనపడుతున్నారు? 500కి.మి పైగా నడిచినా, తన పాదయాత్రను మీడియా పట్టించుకోవడం లేదని ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. కేవలం జగన్ పాదయాత్ర తన సొంత మీడియాకే పరిమితం కావడం, ఇతర చానళ్లలో పెద్దగా కవరేజ్ లేకపోవడంతో మండిపడుతున్నారు. ఇంతకి జగన్ పాదయాత్ర కు కవరేజ్ ఎందుకు రావడం లేదు…… పీ.కే టీం మీడియా వ్యవహారం పై జగన్ కు ఏం చెబుతోంది.. 2019లో పార్టీని అధికారంలోకి తీసుకు వచ్చేందుకు పాదయాత్ర చేస్తున్న జగన్, తన యాత్ర కవరేజ్ విషయంలో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే కడప, కర్నూల్ జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకొని, చిత్తూరు జిల్లాలో నడుస్తున్న ఆయన 500 కి.మి యాత్ర పూర్తి చేశారు. అయితే జగన్ పాదయాత్ర కు ముందే మీడియా కవరేజ్ కోసం లోటస్ పాండ్ లో కొన్ని చానళ్ల ఎడిటర్లను పిలిపించుకొని టీ పార్టీ ఇచ్చారు. సుమారు ఏడు నెలల పాటు జరిగే ఈ పాదయాత్రలో మీడియా సంస్దలు సహకరించాలని ప్రచారం కల్పించాలని కోరారు. ఆ తరువాత పీ.కే కొన్ని ఇంగ్లీషు పత్రికల యాజమాన్యాలతో, కొన్ని చానళ్ల ఎడిటర్లతో ఈ విషయం పై చర్చించారు. అయితే ప్రస్తుతం జగన్ పాదయాత్ర పై మీడియా పెద్దగా కవరేజ్ ఇవ్వడం లేదని జగన్ భావిస్తున్నారు. కేవలం అప్ డేట్స్ మాత్రమే ప్లే చేస్తు ఉండటం, ఆయన బహిరంగ సభల్లో మాట్లాడితే కేవలం రెండు, మూడు నిమిషాలు టెలికాస్ట్ చేయడం పై జగన్ అసంత్రుప్తిగా ఉన్నారు.
జగన్ పాదయాత్ర ప్రారంభం రోజునే హైదరాబాద్ నుండి కడపకు కవరేజ్ కోసం వెళ్లిన మీడియా ప్రతినిధులకు జగన్ మీడియా కోఆర్డినేటర్లు చుక్కలు చూపించారు. గతంలో జగన్ చానల్ లో పనిచేసి, ప్రస్తుతం పాదయాత్ర కవరేజ్ చూస్తున్న ఓ వ్యక్తి వ్యవహార శైలి తో విసిగి పోయిన హైదరాబాద్ మీడియా రెండు రోజులకే గుడ్ బై చెప్పి, తిరిగి వచ్చేసింది. పాదయాత్ర మెదటి రోజే మీడియా ప్రతినిధులకు భోజన ఏర్పట్లు చేయకపోవడంతో, కడప మీడియాకు టిడిపి నేత సతీష్ రెడ్డి ఇంటికి పిలిచి భోజనం పెట్టారు. దీంతో ఈ వ్యవహారం పై జగన్ సీరియస్ అయ్యారు. ఆ తరువాత జిల్లాల్లో ఉన్న మీడియా ప్రతినిధులు పాదయాత్ర కవరేజ్ కు వెళ్లినా, కనీసం భోజనం ఏర్పాట్లు కూడా సరిగా లేకపోవడంతో, వారు సైతం కంటిన్యూగా ఫాలో అవడం లేదు. ఇక మీడియా యాజమాన్యాలు, ఎడిటర్లు, బీట్ రిపోర్టర్లతో జగన్ మీడియా విభాగం నిర్వహించే ఓ ముఖ్య నేత సైతం కొందరు వ్యక్తులు, కొన్ని చానళ్లతో టచ్ లో ఉండటంతో, మిగిలిన వారు పాదయాత్ర ను వదిలేశారు.
 ఇలా జగన్ మీడియా విభాగంలో ఉన్న వ్యక్తులు వ్యవహార శైలి నచ్చక కొందరు, అన్ని చానళ్లను కలుపుకు పోవడం లేదని మరి కొందరు జగన్ పాదయాత్ర ను పట్టించుకోవడం మానేవారు. సో జగన్ తన పాదయాత్రకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే విషయం పక్కన పెట్టి, ఉన్న టీం ను గుడ్ బై చెప్పి, కొత్త వారికి భాద్యతలు అప్పగిస్తే ఈ పరిస్దితిలో మార్పు వస్తుందని కొందరు నేతల సలహా మరి జగన్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15029
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author