జాతకం ప్రకారం రజనీ కింగ్ మేకరే… 

జాతకం ప్రకారం రజనీ కింగ్ మేకరే… 
January 06 18:39 2018
చెన్నై,
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు డిసెంబరు 31 న ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయాల్లోకి వస్తారా? రారా? అనే అనుమానంతో ఉన్న ఆయన అభిమానులు, రజనీ ప్రకటనతో సంబరాలు చేసుకున్నారు. అయితే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోయే రజనీకాంత్‌కు ముఖ్యమంత్రి అయ్యే యోగం లేదని ఓ జ్యోతిషుడు తెలియజేయడం గమనార్హం. రజనీకాంత్ ‘కింగ్ మేకర్’గా ఉంటారు తప్పితే, ‘కింగ్’ అయ్యే అవకాశం లేదని కర్ణాటకకు చెందిన ప్రముఖ జ్యోతిషుడు ప్రకాశ్ అమ్మునాయ్ తెలిపారు. దీనికి కారణాలను కూడా ఆయన వివరించారు.రజనీకాంత్ మకరరాశిలోని, సింహలగ్నంలో జన్మించారని తెలిపిన ఆయన ‘తలైవా’ను ఓడించడం ప్రత్యర్థులకు సాధ్యం కాదని స్పష్టం చేశాడు. కానీ సన్నిహితుల కారణంగా ఆయనకు కీడు జరిగే అవకాశం ఉందని అన్నారు. కాబట్టి సన్నిహితులతో రజనీ అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యమంత్రిని కావాలన్న ఆలోచనను మానుకుని మరొకరిని సీఎం అభ్యర్థిగా ప్రకటించడమే మేలని సూచించారు. పార్టీ నాయకుడిగా ఉంటూ ‘కింగ్ మేకర్’గా ఉండడమే బెటరని రజనీకాంత్‌కు ప్రకాశ్ సూచించారు.తాను సొంతంగా పార్టీ పెట్టి, తమిళనాడులోని 234 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేస్తానని రజనీకాంత్ ప్రకటించారు. రాజులు శత్రు రాజ్యాలపై దండయాత్రలు చేసి దోచుకుంటే, నేటి తరంలో రాజకీయ నాయకులు ప్రజలను లూటీ చేస్తున్నారని రజనీకాంత్ వ్యాఖ్యానించారు. దేవుడి అండతో తాము ఆధ్యాత్మిక పాలన అందిస్తామని, తమిళనాడును చూసి ఇతరుల నవ్వుకుంటున్నారని పరోక్షంగా అన్నాడీఎంకే పాలనను విమర్శించారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15103
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author