అలజడి రేపుతున్న ముద్రగడ కామెంట్స్ 

అలజడి రేపుతున్న ముద్రగడ కామెంట్స్ 
January 08 13:27 2018
రెండు రోజుల క్రిందట ముద్రగడ స్పందిస్తూ, అసలు జనసేన పవన్ కళ్యాణ్ ఎవరో నాకు తెలియదన్నారు. అతనెవరో నాకు పరిచయంలేదని చెప్పారు… ఆ వ్యాఖ్యలు కొంచం అలజడి రేపాయి… నిజానికి ఈ వ్యాఖ్యలు వెనుక జగన్ ఉన్నారు అనేది స్పష్టమైంది… ముద్రగడ పవన్ లాంటి వారితో కలుపుకుని తను కోరుకుంటుంది సాధించాలి.. కాని ఇక్కడ రివర్స్ లో జరుగుతుంది… నిజానికి పవన్ అంటే ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లో జగన్ కు మాత్రమే ఇబ్బంది… ముద్రగడ పవన్ మీద విమర్శలు చెయ్యాల్సిన పని లేదు… ముద్రగడ జగన్ డైరెక్షన్ లో నడుస్తున్నాడు అనటానికి ఇదే ఒక ప్రత్యక్ష ఉదాహరణ… అయితే ముద్రగడ వ్యాఖ్యల పై పవన్ ఇన్ డైరెక్ట్ గా స్పందించారు…ఇవాళ పొద్దున్న ట్వీట్ చేస్తూ, “వ్యక్తిత్వంలో నిన్ను ఓడించడం చేతగాని వల్లే .. నీ కులం, ధనం , వర్ణం గురించి మాట్లాడతారంటూ ట్విట్టర్ లో మెసేజ్ ని పోస్ట్ చేశారు. ఇది ఎవరు చెప్పారో తెలియదు కానీ .. గౌరవనీయ స్థానంలో ఉన్న ఓ సీనియర్ జర్నలిస్ట్ తనను ఈ విధంగా గ్రీట్ చేసారంటూ పేర్కొన్నారు. అందుకే దీన్ని షేర్ చేయాలనిపించింది అని కామెంట్ పెట్టాడు. ఇప్పటికే కులం, పవర్ పాలిటిక్స్ పోషిస్తున్న పాత్ర ప్రమాదకరంగా మారిందని అయన అన్నారు. ఇది మన ఆర్ధిక మందగమనికి కారణమే కాకుంగా సమాజానికి అత్యంత కీడును కలగచేస్తుందని చెప్పారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో కులం గురించి హడావిడి చేస్తుంది ముద్రగడే కాబట్టి, పవన్ ఈ వ్యాఖ్యలు ముద్రగడను ఉద్దేశించి చేసినట్టే అర్ధమవుతుంది… ముద్రగడ చేసిన వ్యాఖ్యలకు, పవన్ తెలివిగా ఒక మెసేజ్ ఇస్తూనే, ముద్రగడ లాంటి వారు ఈ సమాజానికి ప్రమాదకరం అని చెప్పారు… ఎక్కడా ముద్రగడ పేరు చెప్పకపోయినా, ఇది ముద్రగడను ఉద్దేశించి ట్వీట్ చేసిందే అనే విషయం అర్ధమవుతుంది.. మరి పవన్ ట్వీట్ కు, ముద్రగడ ఎలా స్పందిస్తారో చూడాలి..
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15202
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author