వృద్ధులకు బయోమెట్రిక్ కష్టాలు

వృద్ధులకు బయోమెట్రిక్ కష్టాలు
January 08 14:19 2018
నల్గొండ ,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆసరా పింఛన్ పథకానికి శ్రీకారం చుట్టినప్పటికీ స్థానిక అధికారుల నిర్లక్ష్య వైఖరి కారణంగా నీరుగారిపోతుందని చెప్పవచ్చు. ప్రతి నెల ప్రభుత్వం పింఛన్ డబ్బులు విడుదల చేస్తున్నప్పటికి స్థానిక అధికారులు పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం చూపిస్తుండటం వల్లే నాలుగు నెలల నుండి డబ్బులు రావడం లేదని వృద్ధులు ఆరోపిస్తున్నారు. ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్ద సబ్ పోస్ట్ఫాసులో గ్రామానికి సంబంధించిన 183వృద్ధాప్య పింఛన్లు, 90వికలాంగుల పింఛన్లు, 292వితంతువు పింఛన్లు, నాలుగు చేనేత పింఛన్లు, ఐదు గీతకార్మిక పింఛన్లు, 43ఒంటరి మహిళ పింఛన్లు ఉన్నాయి. పింఛన్ లబ్ధిదారులకు ప్రతినెల ప్రభుత్వం నుండి 7.72లక్షల రూపాయలు వస్తున్నాయి. సబ్‌పోస్ట్ఫాసులో బయోమెట్రీక్ మిషన్ లేకపోవడంతో పింఛన్ల పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతుందని వృద్ధులు ఆరోపిస్తున్నారు. మొగిలిగిద్ద సబ్‌పోస్ట్ఫాసు కింద ఎలికట్ట, రంగంపల్లి, రంగదాముల, కిషన్‌నగర్, చించోడు, దేవునిపల్లి, కందివనం, మన్‌ర్రి వంటి గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో పింఛన్లు పంపిణీ చేసేందుకు బయోమెట్రీక్ మిషన్లు ఉన్నప్పటికి స్థానిక సబ్‌పోస్ట్ఫాసులో లేకపోవడం విడ్డూరంగా ఉందని చెప్పవచ్చు. గతంలో వివిధ గ్రామాలలో పంపిణీ చేసిన తరువాతే ఆ బయోమెట్రీక్ మిషన్లను తీసుకొని మొగిలిగిద్ద గ్రామస్తులకు పింఛన్లు పంపిణీ చేసేవారు. పింఛన్ లబ్ధిదారులకు సంబంధించిన డాటా బయోమెట్రీక్ మిషన్‌లలో 1వ తేది నుండి 10వ తేది వరకు మాత్రమే ఉంటుందని, మిగత రోజుల్లో ఉండదని స్థానిక సబ్‌పోస్ట్ఫాసు అధికారులు పేర్కొంటున్నారు. పింఛన్ డబ్బులు ఇవ్వండి సారూ అంటూ నాలుగు నెలల నుండి సబ్‌పోస్ట్ఫాసు చుట్టు ప్రదక్షనలు చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని వృద్ధులు ఆరోపిస్తున్నారు. సబ్‌పోస్ట్ఫాసుకు ప్రత్యేకంగా బయోమెట్రీక్ మిషన్‌ను ఏర్పాటు చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని పింఛన్ లబ్ధిదారులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15232
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author