కండ్లగుంట గ్రామంలో చాగంటి ప్రవచనాలు

కండ్లగుంట గ్రామంలో చాగంటి ప్రవచనాలు
January 08 16:24 2018
సత్తెనపల్లి,
గుంటూరు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం లోని  నకరీకల్లు మండలం కండ్లగుంట గ్రామంలో రాష్ట్ర శాసనసభాపతి కోడిల శివప్రసాద్, ఆధ్యాత్మిక ప్రవచనకర్త చాగంటి కోటెశ్వరరావు పర్యటించారు. అక్కడ జరిగిన ప్రవచనాల కార్యక్రమంలో స్పీకర్ కుడా పాల్గోన్నారు. ఈ సందర్బంగా కోడెల మాట్లాడుతూ చాగంటి కోటేశ్వరరావు వచనాలు మనల్ని తన్మయత్వంలోకి తీసుకువెళుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ వారు పుట్టిన ఊరి రుణం తీసుకోవాలని అన్నారు. చాగంటి ప్రవచనాలు మనుషులకు ప్రశాంతతను, బక్తిభావనను కలిగిస్తాయని కొనియాడారు. చాగంటి మాట్లాడుతూ స్పీకర్ ఉన్నతమైన స్థానంలో ఉండి సామాన్యంగా అందరిలో కలసిపోతారని కితాబునిచ్చారు. మా గ్రామానికి రావాలని స్పీకర్  పిలుపుమేరకు ఇక్కడకు రావడం సంతోషమని అన్నారు. నరసరావుపేట, సత్తెనపల్లి లో రుద్రభూములను మరుభూములుగా ఉద్యానవనాలాగా తీర్చిదిద్దారని అభినందించారు. 35వేల మరుగుదొడ్లు నిర్మాణం ఆయనకే సాధ్యమని అన్నారు. కండ్లగుంట గ్రామ ప్రజల ఆదరాభిమానాలు చూసి పరవశించి పోయానని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15242
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author