సెట్ ల తేదీలను ప్రకటించిన మంత్రి గంటా 

సెట్ ల తేదీలను ప్రకటించిన మంత్రి గంటా 
January 08 17:32 2018
అమరావతి,
ఆంధ్రప్రదేశ్లో నిర్వహించనున్న ఎంసెట్, ఐసెట్, ఈసెట్ తేదీలను మంత్రి గంటా శ్రీనివాస రావు సోమవారం నాడు ప్రకటించారు. ఎపి ఎంసెట్ ఇంజనీరింగ్ పరీక్షలు ఏప్రిల్ 22నుంచి 25 వరకూ జరుగుతాయని చెప్పారు. ఎంసెట్ ఇంజనీరింగ్ను జెఎన్టియు-కాకినాడ నిర్వహిస్తుందని ఆయన అన్నారు. ఏప్రిల్ 26న ఎంసెట్ మెడిసిన్ పరీక్ష ఉంటుందని చెప్పారు. ఐసెట్ మే 2 ఎస్వీ యూనిర్శిటీ నిర్వహిస్తుందని, ఈసెట్ మే 3న జెఎన్టియు-అనంతపురం నిర్వహిస్తుందని ఆయన అన్నారు. పీఈసెట్ మే 4న ఎఎన్యు నిర్వహిస్తుందని ఆయన చెప్పారు. ఇకపై ఎపి ఎంసెట్, ఈసెట్ తదితర పరీక్షలన్నీ ఆన్లైన్లోనే జరుగుతాయని మంత్రి తెలిపారు. వాటి  ఫలితాలను వారంలోపే విడుదల చేస్తామన్నారు. ఎంసెట్కు 115 నుంచి 150 కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15266
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author