పస్తులతో పసుపు రైతు

పస్తులతో పసుపు రైతు
January 09 15:48 2018
రాజమండ్రి,
ఆరుగాలం కష్టపడే పసుపు రైతులకు ఈ ఏడాది పెట్టుబడులలకు తగ్గ ఫలితం రాకపోవడంతో పండుగవేళ పస్తులుండే పరిస్థితి నెలకొందిని పసుపు రైతాంగం దిగులుపడుతున్నారు. ప్రతి ఏడాది సంక్రాంతి పండుగ సీజన్లో పసుపు రైతులు ఆనందంగా ఉండే పరిస్థితి ఉండగా ఈ ఏడాది అందుకు భిన్నంగా గిట్టుబాటు ధర పలకక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గం పరిధిలోని రావులపాలెం, ఆలమూరు, ఆత్రేయపురం, కొత్తపేట మండలాల్లో ఈ ఏడాది వేలాది ఎకరాల్లో రైతులు పసుపుపంటను సాగు చేస్తున్నారు. అయితే ఈ పంటకు ఎకరాకు లక్షా ఇరవై వేల నుంచి లక్షా నలభై వేల వరకు పెట్టుబడులు అవుతుండగా ఈ ఏడాది పసుపు ధర పూర్తిగా పతనమైంది. కనీసం విత్తన ఖర్చులు, ఎరువులు, కూలీల ఖర్చులు కూడా రాని పరిస్థితిలో పసుపు రైతు నష్టాలబారిన పడి వీధిన పడే స్థితిలో ఉన్నామంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు.ఇదిలా ఉండగా పసుపు కొనుగోలు విషయంలో దళారుల బెడద ఎక్కువగా ఉండటం..వారు చెప్పిన రేటుకే పసుపు అమ్ముకోవాల్సి వస్తుండటంతో మరింత నష్టాలు మూటకట్టుకోవలసిన పరిస్థితి నెలకొందని రైతులు వాపోతున్నారు.ఇప్పటికైనా ప్రభుత్వం పసుపు పంటకు సరైన గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని కోరుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15330
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author