కర్నూలులో మరో జిల్లా కోర్టు

కర్నూలులో మరో జిల్లా కోర్టు
January 09 15:56 2018
కర్నూలు,
కర్నూలు జిల్లాకు మరో అదనపు జిల్లా కోర్టు మంజూరైంది. రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న న్యాయవాదులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఆళ్లగడ్డలో అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటుకు రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నంద్యాలలో ఉన్న ఐదో అదనపు జిల్లా న్యాయస్థానాన్ని ఆళ్లగడ్డకు కేటాయించారు.కర్నూలు జిల్లాలో ఇంతవరకు అదనపు జిల్లా న్యాయస్థానాలు కర్నూలు, ఆదోని, నంద్యాలలో మాత్రమే ఉన్నాయి. ఇక ఆళ్లగడ్డలోనూ జిల్లా అదనపు న్యాయస్థానం అందుబాటులోకి వస్తుండడంతో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆళ్లగడ్డలోనే పెద్ద కేసుల విచారణ జరగబోతోంది. ఆళ్లగడ్డ న్యాయచరిత్రలో ఇది ఓ నూతన అధ్యాయంగా భావించవచ్చు. అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటుకు కావాల్సిన ముందస్తు చర్యలను నంద్యాల 3వ అదనపు జిల్లా న్యాయమూర్తి వారు బార్‌ అసోసియేషన్‌ సభ్యులతో సమావేశం నిర్వహించారు. అదనపు జిల్లా న్యాయస్థానం ఏర్పాటుతో ప్రయోజనాలు వివరించారు.ఆళ్లగడ్డలో ఇంతవరకు అసిస్టెంటు సెషన్సు జడ్జి కోర్టు, జ్యుడీషియల్‌ ఫస్టుక్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులు మాత్రమే ఉన్నాయి. ఇక్కడ తీవ్రనేరాల కంటే తక్కువ స్థాయి వాటిని విచారణకు స్వీకరిస్తారు. హత్యానేరాలకు సంబంధించిన కేసుల విచారణ నంద్యాలలోని జిల్లా కోర్టులో జరుగుతుంది. దీంతో పాటు రహదారి ప్రమాదాలకు సంబంధించిన బీమా కేసుల విచారణ సైతం జిల్లా కోర్టులోనే జరుగుతున్నాయి. ఆళ్లగడ్డకు అదనపు జిల్లా కోర్టు అందుబాటులోకి రానుండడంతో ఇకనుంచి ఇటువంటి అన్ని కేసుల విచారణ ఇక్కడే జరుగుతుందని న్యాయవాదులు చెపుతున్నారు.మొత్తానికి ఆళ్ళగడ్డకు ఐదో అదనపు జిల్లా కోర్టు రావడంతో జిల్లా న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15333
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author