రాష్ట్ర అభివృద్దికి అందరి సహాకారం కావాలి

రాష్ట్ర అభివృద్దికి అందరి సహాకారం కావాలి
January 09 16:26 2018
చిత్తూరు,
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా చిత్తూరు జిల్లా చిన్న పాండూరులో అపోలో టైర్ల ఫ్యాక్టరీకి చంద్రబాబు శంకుస్థాపన చేశారు. చిన్న పాండూరులో 260 ఎకరాల విస్తీర్ణంలో రూ.1,200 కోట్లతో అపోలో టైర్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తున్నారు. రెండో దశలో అపోలో యాజమాన్యం రూ.4,500 కోట్లతో టైర్ల పరిశ్రమను విస్తరించనుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు నారా లోకేశ్, అమర్నాథ్రెడ్డిలు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు మాట్లాడుతూ 2022సంవత్సరానికి అభివృద్థిలో దేశంలోనే ఎపిని మొదటి మూడుస్థానాల్లో నిలుపుతామని అన్నారు.  కొత్త పరిశ్రమల రాకతో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తాయి. శాశ్వతంగా పేదరికం పోవాలన్నా, యువత ఆర్థికంగా నిలదొక్కుకోవాలన్నా కొత్త పరిశ్రమల ఏర్పాటు అవసరమని అయన అన్నారు. చిత్తూరుజిల్లా ఆటో మొబైల్ హబ్ గా తయారవుతోంది.ఎపిలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలి. 3లక్షలకు పైగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం.  ప్రతిపక్ష నేతలు విమర్సలు చేయడం కాదు కళ్ళు తెరిచి చేస్తున్న అభివృద్థిని చూడాలని అన్నారు. ఎపిలో మరిన్ని పరిశ్రమలు రావాల్సిన అవసరం ఉంది. బయోటెక్నాలజీ, టెక్స్ టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ లలో ఎపి ముందుకు దూసుకుపోతోంది. ఎపిని అభివృద్థి చేయాలంటూ అందరి సహకారం అవసరమని అన్నారు.
రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖామంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో సమర్థుడైన నాయకత్వం ఉండడం వల్లే కొత్త పరిశ్రమలు వస్తున్నాయి. ఎపిని చంద్రబాబునాయుడు అన్ని విధాలుగా అభివృద్థి చేస్తున్నారు. ఎపిలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే పారిశ్రామిక వేత్తలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అన్నారు. ఫిబ్రవరి 23,24,25తేదీలలో విశాఖపట్నంలలో పారిశ్రామిక వేత్తలతో సమావేశం వుంటుందని అయన అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15349
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author