తిరుమలలో రధసప్తమీ వేడుకలు

తిరుమలలో రధసప్తమీ వేడుకలు
January 09 16:58 2018
తిరుమల,
తిరుమలలో ఒక రోజు బ్రహ్మోత్సవాన్ని తలపించే రథసప్తమి వేడుకలను నిర్వహించేందుకు టీ.టీ.డీ సిద్దమైంది. 24 వ తేదీ తెల్లవారు జాము నుండి సాయంత్రం వరకు ఈ వేడుకలు తిరుమలలో అంగరంగ వైభవంగా జరగ నున్నాయి. శ్రీమలయప్ప స్వామి అవతారంలో వెంకన్న స్వామి భక్తులకు దర్శనం ఇస్తారు. ప్రతి రెండు గంటలకు ఓ వాహనంపై విహరిస్తూ భక్తులకు మోక్షాన్ని ప్రసాదిస్తారు. ఆ రోజు మొత్తం సప్త వాహనాల పై స్వామి వారు ఊరేగుతారు. ఈ ఒకరోజు ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించాలని టీ.టీ.డీ బారీ ఏర్పాట్లు చేస్తున్నది. వేలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి, ఈ ఒకరోజు బ్రహ్మోత్సవంలో పాల్గొననున్నారు.
ఆ రోజు వేకువ జామున 5.30 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు స్వామి వారు భక్తుల మద్యనే ఉండి, దర్శన భాగ్యం ఇస్తారు.  సూర్య ప్రభ వాహనంతో ప్రారంభమైన ఉత్సవాలు….రోజుంతా జరుగుతాయి. చిన్నశేష వాహనం, గరుడ వాహనం, హనుమంత వాహనం, కల్పవృక్ష వాహనం, సర్వభూపాల వాహనం, చంద్రప్రభ వాహనసేవలు స్వామి వారికి నిర్వహిస్తారు.
మధ్యాహ్నం రెండు గంటలకు పుష్కరిణిలో చక్రస్నానం ఘట్టాన్ని కూడా ఘనంగా నిర్వహిస్తారు. ఇప్పుడు జరగబోయే ఉత్సవాలకు భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది చివర్లో తిరుమమలలో వైకుంఠ ఏకాదశీ వేడుకలు జరిగాయి. అప్పుడు చాలా మంది భక్తులు నానా ఇబ్బందులు పడ్డారు. సరైన ఏర్పాట్లు లేక స్వామి వారి దర్శనం సంతృప్తికరంగా జరక్క నానా ఇబ్బందులు పడిన పరిస్థితి. ఒక ఈ ఏడాది తొలిరోజు అంటే జనవరి పస్ట్ రోజున అంతే… రద్దీ ఎక్కువగా ఉన్నడంతో నానా అవస్థలు పడ్డారు. ఈ నేపద్యంలో ఇప్పుడు జరిగే రధసప్తమీ వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని అదికారులు బావిస్తున్నారు. భక్తులకు సౌకర్యాల కల్పనకు టీ.టీ.డీ భారీ ఏర్పాట్లు చేపట్టింది. తిరువీధుల వెంట గ్యాలరీలను నిర్మిస్తున్నది. తోపులాటలు తొక్కిసలాటలు లేకుండా స్వామి వారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేస్తున్నది. ఎండ నుంచి నీడను కల్పిస్తూ అక్కడక్కడ చలువ పందిళ్లను వేస్తున్నారు. గ్యాలరీల్లోని భక్తులకు ఎప్పటి కప్పుడు అన్న పానీయాలు విస్తృతంగా అందించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
 టీ.టీ.డీ అనుబంధ ఆలయాల్లో కూడా ఈ రథసప్తమి వేడుకలు నిర్వహిస్తున్నారు. తిరుచానూరు లోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహన సేవ ప్రారంభమవుతుంది. రాత్రి 9.30 గంటల వరకు అమ్మవారు సింహ వాహనం, అశ్వ వాహనం, గరుడ వాహనం, పెద్దశేష వాహనం, చంద్రప్రభ వాహనం, గజవాహనాలపై అమ్మవారు వూరేగనున్నారు. అలాగే తిరుచానూరు సమీపంలోని వెలసిన శ్రీసూర్యనారాయణ స్వామి ఆలయంలో కూడా అత్యభ్యుతంగా రధసప్తమీ వేడుకలు జరగనున్నాయి. ఉదయం 6 గంటలకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శన మిస్తారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15365
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author