‘కొడకా కోటేశ్వరరావు’ పాటపై ఫిర్యాదు

‘కొడకా కోటేశ్వరరావు’ పాటపై ఫిర్యాదు
January 10 11:19 2018
విజయవాడ,
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటించిన  అజ్ఞాతవాసి సినిమాలోని ‘కొడకా కోటేశ్వరరావు’ పాటపై మాచవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు నమోదయింది.  తమ మనోభావాలు దెబ్బతినేలా పాట ఉందని న్యాయవాది కోటేశ్వరరావు ఆరోపించారు. దీనికి సంబంధించి మాచవరం పోలీస్ స్టేషన్లో ఆయన ఫిర్యాదు చేశారు. సినిమా నిలుపుదల చేయాలని,
 లేనిపక్షంలో సినిమా కలెక్షన్లు మొత్తం కోర్టులో డిపాజిట్ చెయ్యాలని అయన కోరారు. ఫిర్యాదు స్వీకరించి ఉన్నత అధికారులు సంప్రదించి నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. విజయవాడ పోలీసులు కేసు నమోదు చెయ్యకపోతే కోర్టు లో ఫైల్ చేస్తామని న్యాయవాది అంటున్నారు. సినిమాలో ‘కొడకా కోటేశ్వరరావు’ పాటను తొలగించాలని, పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్, రచయిత, నిర్మాతపై చర్యలకు డిమాండ్ చేశారు. ఈనెల 10వతేదీన విడుదలకు సిద్ధంగా ఉన్న అజ్ఞాతవాసికి ఈ వివాదం ఏ మలుపు తిప్పుతుందోనని సినీ ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15398
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author