స్టాక్ మార్కెట్‌లో వాటాదారుగా తిరుమల శ్రీవారు

స్టాక్ మార్కెట్‌లో వాటాదారుగా తిరుమల శ్రీవారు
January 10 12:08 2018
చిత్తూరు,
టీటీడీ దేవస్థానం పరిపాలనలోనూ, సేవల్లోనూ ఆన్‌లైన్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టడంతో సౌకర్యాలు అందరికీ సులభతరం అయ్యాయి. ఇంటెర్నెట్‌ ద్వారా ఇంటి వద్ద నుంచే భక్తులు టీటీడీలోని అన్ని సౌకర్యాలు సులభంగా పొందుతున్నారు. తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో 20 నుంచి 40 శాతం ఇంటెర్నెట్‌ అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ ద్వారా కేటాయిస్తున్నారు. 2010లో కరెంట్‌ బుకింగ్‌తో ప్రారంభించిన 300 రూపాయల శీఘ్రదర్శన టికెట్లను 2013 నుంచి పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ పద్ధతి ద్వారా కేటాయిస్తున్నారు. రద్దీని బట్టి 15 వేల నుంచి 25 వేల వరకు టికెట్లు కేటాయిస్తున్నారు. టీటీడీ పరిధిలో మొత్తం 9 ట్రస్టులు, ఒక స్కీమ్‌ ఉంది. లక్ష రూపాయల నుంచి కోట్లలో విరాళాలు సమర్పించిన 47 వేల మంది దాతల వివరాలు అధికారులు ఇప్పటికే పూర్తిస్థాయిలో డిజిటల్‌ చేశారు. ఈ పాస్‌బుక్‌ కింద దాతలకు శ్రీవారి దర్శనం, తిరుమలలో బస సౌకర్యాలన్నీ ఆన్‌లైన్లో ముందస్తుగా రిజర్వు చేసుకునే అవకాశం కలిగింది.
తిరుమల శ్రీవారు కూడా స్టాక్‌మార్కెట్‌లో వాటాదారుగా చేరారు. స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ఇండియా లిమిటెడ్‌లో శ్రీవేంకటేశ్వర స్వామివారి పేరుతో డీమ్యాట్‌ ఖాతా తెరిచారు. దీనిద్వారా భక్తులు షేర్లను సర్టిఫికేట్ల రూపంలో హుండీలో సమర్పిస్తుంటారు. 1000 రూపాయలు, 500 రూపాయల నోట్ల రద్దు తర్వాత తిరుమలకు వచ్చే భక్తుల ద్వారా డిజిటల్‌ చెల్లింపుల్ని టీటీడీ పెంచింది. గదులు, దర్శన టికెట్ల కేంద్రాల్లో ఇప్పటికే పీవోఎస్‌ యంత్రాలు అమర్చి నగదు రహిత వ్యవహారాలు చేయిస్తున్నారు. టీటీడీ ముద్రించిన ఆద్యాత్మిక, ధార్మిక, సాహిత్య పరమైన ప్రచురణలు సుమారు 2500 కి పైగా డిజిటలైజేషన్ చేశారు. ఈ మధ్యన బైల్‌ యాప్‌తోనూ అందుబాటులో అన్ని సౌకర్యాలు తెచ్చింది టీటీడీ దేవస్థానం. చేతిలో సెల్‌ఫోన్‌ ఉంటే చాలు శ్రీవారి 300 రూపాయల దర్శనం, అన్ని రకాల ఆర్జిత సేవలు, గదుల బుకింగ్‌ చేసుకోవచ్చు. ఇక హుండీకి కూడా సెల్‌ఫోన్‌ ద్వారానే కానుకలు ట్రాన్స్ పర్ చేయవచ్చు. ఈ రంకంగా డిజిటల్ దేవస్థానంగా పేరు తెచ్చు కుంటుంది టీటీడీ.
2018 మార్చి నాటికి ఈ–ఫైలింగ్‌ వ్యవస్థ పూర్తి చేయాలనే లక్ష్యంతో టీటీడీ ముందుకు ధూసుకుపోతుంది. ఇక తెలుగు, కన్నడలో టీటీడీ వెబ్‌సైట్లు, త్వరలో తమిళం, హిందీలోనూ అందుబాటులోకి రానున్నాయి.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15418
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author