ప్రజలకు పట్టని పాదయాత్రలు

ప్రజలకు పట్టని పాదయాత్రలు
January 10 12:24 2018
ఏలూరు,
పాదయాత్రలు ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయింది. ప్రజలను కలవడానికి నాయకలకు  ఇదే దగ్గరి మార్గం. పార్టీలు వ్యూహాత్మకంగా తమ నేతలతో పాదయాత్రలు చేయిస్తున్నారు. ఫలితాలు పొందుతున్నారు. దివంగత సిఎం వైఎస్, సి.ఎం చంద్రబాబులు అధికారంలోకి రావడానికి పాదయాత్రలు దోహదం చేశాయి. ఇప్పుడు జగన్ అదే పద్దతిలో పాదయాత్ర చేస్తున్నాడు. మరోవైపు తాము వెనుకబడ్డామనే ఆలోచనతో కాంగ్రెస్ ఏపీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి రాజమండ్రి నుంచి పోలవరం ప్రాజెక్టు వరకు పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ పార్టీ మహాపాదయాత్రకు జనం పెద్దగా రావడం లేదు. ఫలితంగా యాత్ర అసలు జరుగుతుందా లేదా అనే చర్చ సాగుతోంది. తొలి రోజు మీడియా కాస్తంత ప్రచారం ఇచ్చింది. ఆ తర్వాత జగన్ పాదయాత్రలానే దాన్ని పట్టించుకోవడం మానేసింది.  మూడోరోజైన మంగళవారం జరిగిన పాదయాత్రలో సీనియర్ నేతలు కిల్లి కృపారాణి, కేవీపీ రామచంద్రరావు తదితరులు పాల్గొని క్యాడర్ లో ఉత్సాహం నింపే ప్రయత్నం  చేశారు. తమకు ప్రచారం రావడం లేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక పేపర్, టీవీ ఉంటే బాగుంటుందనే ఆలోచన చేస్తున్నారు నేతలు. వీలున్నంత తొందరగా ఒక టీవీ చానల్ తో ఒప్పందంం చేసుకోవాలని ఆలోచిస్తున్నారు వాళ్లు. జగన్ యాత్రను ఎలాగు సాక్షిలో బాగానే చూపిస్తున్నారు. ఇక కాంగ్రెస్ పరిస్థితి రెండిటికి చెడ్డ రేవడి అయింది. అటు టీడీపీ అనుకూల మీడియాగానీ..ఇటు వైకాపా అనుకూల మీడియానే కాదు..మధ్యే మార్గంగా ఉండేవారు పట్టించుకోక పోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15424
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author