పవర్ స్టార్ అభిమానులకు పూనకం

పవర్ స్టార్ అభిమానులకు పూనకం
January 10 12:48 2018
హైద్రాబాద్,
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ పేరు వింటే పవన్ అభిమానులకు పూనకం వచ్చేస్తుంది. హీరోగానే కాకుండా పొలిటికల్ లీడర్‌ ‘జనసేనాని’గా మారడంతో పవన్ మేనియా రెట్టింపయ్యింది. పవన్ కళ్యాణ్‌‌ను పెద్ద స్క్రీన్‌పై  చూసిన ఫ్యాన్స్ కసితో ఉన్నారు. ఇక పవన్‌ సినిమా అంటే థియేటర్స్ వద్ద మామూలు హంగామా ఉండదు. భారీ కటౌట్లు, బైక్ ర్యాలీలు, అరుపులు, కేకలతో థియేటర్స్ దద్దరిల్లేట్లు చేస్తారు. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ‘అజ్ఞాతవాసి’ కొత్త కొత్త కాన్సెప్ట్‌లతో పవన్ అభిమానులు తమ టాలెంట్ చూపిస్తున్నారు.ఒకరు పట్టుచీరలపై పవన్ కళ్యాణ్‌ను నేస్తుంటే.. మరొకరు పవన్ కోసం ఏకంగా టన్నుల కొద్దీ పేపర్‌లను కొనేసి థియేటర్‌లో పవన్‌పై విసిరేందుకు రెడీ అవుతున్నారు. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పవన్ అభిమానులు తమకు నచ్చిన రీతిలో పవన్‌పై ఉన్న అభిమానాన్ని చూపిస్తూ.. మా చర్యలు ఊహాతీతం పవన్ సార్.. అంటున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15439
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author