శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ఐఐటీల్లో ఫ్యాక‌ల్టీ భ‌ర్తీ

శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ఐఐటీల్లో ఫ్యాక‌ల్టీ భ‌ర్తీ
January 10 17:23 2018
అమ‌రావ‌తి
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న విశ్వ‌విద్యాల‌యాల అధ్యాప‌కుల భ‌ర్తీ మాదిరిగా కొంత శాత‌మైనా  శాశ్వ‌త ప్రాతిప‌దిక‌న ఐఐటీల్లో ఫ్యాక‌ల్టీ భ‌ర్తీ చేసేలా చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని మంత్రి గంటా తెలిపారు. ఒంగోలు ఐఐటి క్యాంప‌స్ కు ఇప్ప‌టికే మూడు స్థ‌లాలు ప‌రిశీలించామ‌ని, త్వ‌ర‌లో దీనిపై త‌దుప‌రి నిర్ణ‌యం తీసుకుంటామ‌ని మంత్రి తెలిపారు. క్యాంప‌స్ భూమి కేటాయింపుతో పాటు ఫ్యాక‌ల్టీ భ‌ర్తీపైన ఆర్జీయూకేటీ చాన్స‌ల‌ర్,వైస్ చాన్స‌ల‌ర్లతో చర్చించారు.ఇంట‌ర్ ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష్ల‌ల‌ను ఎలాంటి లోటుపాట్లు లేకుండా నిర్వ‌హించాల‌ని, విద్యార్థుల జంబ్లింగ్ తో పాటు ఎగ్జామిన‌ర్ల జంబ్లింగ్ చేసే విధానాన్ని అనుస‌రించాల‌ని ఇంట‌ర్మీడియ‌ట్ విద్యాశాఖ అధికారుల‌ను ఆదేశించారు. విద్యార్థుల‌తో పాటు ఎగ్జామిన‌ర్ల‌కు జంబ్లింగ్ విధానాన్ని అనుస‌రించాల‌ని స్ప‌ష్టం చేశారు.  కేంద్రాల వ‌ద్ద   సీసీటీవీ ల‌ను ఏర్పాటు చేసి కంప్యూట‌ర్  ద్వారా మానిట‌రింగ్ చేయాల‌ని పేర్కొన్నారు.ప్రాక్టికల్స్ నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి లోటుపాట్ల‌కు తావులేకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని,ఎథిక‌ల్ అండ్ హ్యుమాన్ వాల్యూస్ అంశానికి సంబంధించిన‌ ప్ర‌శ్న‌ప‌త్రాన్ని ప‌రీక్ష జ‌రిగే రోజు .. ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు  ప్ర‌ధాన కార్యాల‌యంలో నుంచే ఇవ్వాల‌ని సూచించారు.  ఈ నెల 20న ప్రైవేటు, కార్పోరేట్  క‌ళాశాల‌ల మేనేజ్ మెంట్ల‌తో మంత్రి గంటా స‌మావేశ‌మై… ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌లు, ఇత‌ర అంశాల‌పై ప‌లు సూచ‌నలు చేయ‌నున్నారు. అదే విధంగా.. ప్రాక్టిక‌ల్ ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌పై  23న వీడియా కాన్ఫ‌రెన్స్ ను నిర్వ‌హించనున్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15471
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author