జన్మభూమి లో అందోళనలు

జన్మభూమి లో అందోళనలు
January 10 17:54 2018
విజయనగరం,
విజయనగరం జిల్లా కురుపం మండలంలోని గోటివడా పంచాయితీ లో జన్మభూమి లో నిరసనలు వ్యక్తమయ్యాయి. మా ప్రధాన సమస్యలు తీరుస్తామని లికితపూర్వక హామీ ఇస్తాం అంటే నే జన్మభూమి లో పాల్గొంటామని గ్రామస్థులు మొండికేసారు.  గ్రామానికి రోడ్డు లేక గర్భిణీ లు పడుతున్న బాధలు ఎన్ని జన్మభూమి లో ఫిర్యాదు చేసిన పట్టించుకొనే నాధుడే లేడని ఆరోపించారు. ఇల్లు లేనివారికి బాత్రూమ్ ఎందుకని,  జన్మభూమి కమిటీకి సంక్షేమ పధకాలకు సంబంధం ఏమిటి అని టీడీపీ కార్యకర్తలకు ఇల్లు ఇస్తారా మిగిలిన వాళ్ళు మనుసులు కాదని ప్రశ్నల వర్షం కురిపించారు. మా గ్రామంలో మేకలు,  పశువులు ఆధారంగా బ్రతికే మాకు ఎన్ని పశువుల చనిపోతున్నా పట్టించుకునే వెటరినరి అధికారులు ఎక్కడ అని నిలదీసారు. మేము పండించే జొన్న పంట వివరాలు ఏ అగ్రికల్చర్ అధికారుల  తెలుసా అని అడిగారు. రెవిన్యూ అధికారులు గ్రామస్తులకు ఏజెన్సీ ధ్రువపత్రాలు మాంజరు చేయడం లేదు. దాంతో  ఏజెన్సీ సర్టిఫికెట్ లేక ఉద్యోగ అవకాశాలకు  దూరం అవుతున్నామని వారు విమర్శించారు. గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని లికితపూర్వక హామీ ఇస్తేనే జన్మభూమి లో పాల్గోంటామని వారు  ఆందోళనకు దిగారు
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15484
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author