అజ్ఞాతవాసి రివ్యూ

అజ్ఞాతవాసి రివ్యూ
January 10 18:20 2018
నటీనటులు: పవన్‌కల్యాణ్‌.. బొమన్‌ ఇరానీ.. ఖుష్బూ.. ఆది పినిశెట్టి.. కీర్తిసురేష్‌.. అను ఇమ్మాన్యుయేల్‌.. తనికెళ్ల భరణి.. మురళీ శర్మ.. రావు రమేష్‌.. వెన్నెల కిషోర్‌.. రఘుబాబు…
మ్యూజిక్: అనిరుధ్‌ రవిచంద్రన్‌
డైరెక్టర్: త్రివిక్రమ్‌
ప్రొడ్యూసర్: ఎస్‌.రాధాకృష్ణ(చినబాబు)
టాలీవుడ్ స్టార్ కాంబినేషన్ లో పవర్ స్టార్ పవన్‌కల్యాణ్‌-త్రివిక్రమ్‌ ముందు వరుసలో ఉంటారు. వారిద్దరూ కలిసి ఓ సినిమా చేస్తున్నారంటేనే అంచనాలను అందుకోవడం కష్టం. ఈ విషయాన్ని ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’ నిరూపించాయి. ఇప్పుడు ‘అజ్ఞాతవాసి’తో మరోసారి తమ సత్తా చాటేందుకు వచ్చారు. సంక్రాంతి బరిలో దిగిన ‘అజ్ఞాతవాసి’ కథేంటి? పవన్‌-త్రివిక్రమ్‌ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ కొట్టిందా?
కథేంటంటే: ప్రముఖ ఇండస్ట్రియలిస్ట్, ఏబీ గ్రూప్‌ అధినేత గోవింద భార్గవ్‌ అలియాస్‌ విందా(బొమన్‌ఇరానీ), అతని కుమారుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా చంపేస్తారు. తనకు వారసులు లేరని అనుకోకుండా విందా భార్య ఇంద్రాణి(ఖుష్బూ) కంపెనీ వ్యవహారాలు చూసుకునేందుకు ఓ యువకుడిని (పవన్‌కల్యాణ్‌) అసోం నుంచి పిలిపిస్తుంది. అతను బాలసుబ్రహ్మణ్యం పేరుతో ఏబీ గ్రూప్‌లో పర్సనల్‌ మేనేజర్‌గా చేరతాడు. కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ విందా హత్యలకు కారకులైన వారి కోసం అన్వేషిస్తుంటాడు. మరి ఆ హత్యలు చేసింది ఎవరు? ఎందుకు చేశారు? ఇందులో సీతారామ్‌(ఆది పినిశెట్టి) పాత్ర ఏంటి? అసలు అసోం నుంచి వచ్చింది నిజంగా బాల సుబ్రహ్మణ్యమేనా? ‘అజ్ఞాతవాసి’గా అతను ఎందుకు వచ్చాడు? బాల సుబ్రహ్మణ్యంగా వచ్చిన వ్యక్తి అభిషిక్త భార్గవ ఎలా అయ్యాడు? అతనికి విందా కుటుంబానికి సంబంధం ఏంటి?
ఎలా ఉంది: ‘అజ్ఞాతవాసి’ నూటికి నూరుపాళ్లు పవన్‌-త్రివిక్రమ్‌ కాంబో మూవీ. అందులో ఎలాంటి సందేహం లేదు. కార్పొరేట్‌ వ్యవహారాలు,  అందులో ఆధిపత్య పోరు.. ఎత్తులు, పైఎత్తులు మొదలైన అంశాల చుట్టూ ప్రధానంగా స్టోరీ నడుస్తుంది. కథను నడిపించేందుకు పురాణ, ఇతిహాసాల్లోని అంశాలను నేపథ్యంగా తీసుకున్నాడు డైరెక్టర్. కూర్చునే కుర్చీ తయారవడానికి జరిగే ప్రక్రియ గురించి తొలి సన్నివేశాల్లో కథానాయకుడు చెప్పటం బట్టి.. స్టోరీని అంచనా వేయవచ్చు. ఈ పోరాటానికి కుటుంబ బంధాలు, పిట్ట కథల్లాంటి ప్రేమ వ్యవహారం, కొన్ని వినోద సన్నివేశాలను అతికించుకుంటూ వెళ్లాడు.
స్టోరీని స్లోగా స్టార్ చేసి ప్రారంభించి  ఇంటర్వెల్ వచ్చే సమాయానికి పలు చిక్కు ముడులను పెట్టి ప్రేక్షకుడిలో ఉత్కంఠ రేకెత్తించాడు. హత్యలకు కారణమెవరో తెలుసుకున్న బాల సుబ్రహ్మణ్యం వారిని ఏ విధంగా మట్టుబెట్టాడన్నది సెకండ్ హాఫ్. ఇంటర్వెల్‌ ముందు వచ్చే ట్విస్ట్‌ ఆకట్టుకుంటుంది.   ఫస్ట్ హాఫ్ లో పవన్‌ ఎంట్రీ ఆకట్టుకుంటుంది. విందాను హత్య చేసి, అతని  సామ్రాజ్యాన్ని కూల్చలనుకున్నది ఎవరు? అనే అంశం చుట్టూ సెకండ్ హాఫ్ నడిచింది. ఈ క్రమంలో కథానాయకుడు ఎదుర్కొన్న పరిస్థితులను చూపించాడు దర్శకుడు. దీంతో పాటు విందా కంపెనీలో శర్మ(మురళీశర్మ) వర్మ(రావురమేష్‌)ల పాత్రలతో హాస్యాన్ని పండించే ప్రయత్నం చేశాడు. త్రివిక్రమ్‌ శైలి కామెడీ అందరికీ నవ్వులు పంచుతుంది. ఆయా సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. క్లైమాక్స్ లో  తన మార్కు జోడించి తీర్చిదిద్దాడు త్రివిక్రమ్‌.
ఎవరెలా చేశారు: ఇది పూర్తిగా హీరో చుట్టూ తిరిగే కథ. బాలసుబ్రహ్మణ్యం, అభిషిక్త భార్గవగా పవన్‌ తన నటనతో ఆకట్టుకున్నాడు. డైలాగులు, యాక్షన్‌ సన్నివేశాల్లో పవన్‌ మార్కు కనపడుతుంది. చాలా గ్యాప్ ఖుష్బూకు మరో మంచి రోల్ దక్కింది. సెకండ్ హాఫ్, క్లైమాక్స్ లో ఆమె నటన ఆకట్టుకుంటుంది. మురళీశర్మ, రావు రమేష్‌లు కామెడీకే పరిమితమయ్యారు. హీరోయిన్లకు పెద్దగా ప్రాధాన్యం లేకపోయినా.. సినిమాకు అందం తీసుకొచ్చారు. ఆది పినిశెట్టి నటన ఓకే అనిపిస్తుంది. హీరో పాత్రస్థాయికి తగ్గట్టు విలన్ పాత్రను తీర్చిదిద్ది ఉంటే ఇంకా బాగుండేది. విలన్ సీతారామ్‌ పాత్రను మరింత బలంగా తీర్చిదిద్ది ఉంటే అభిషిక్త భార్గవ పాత్ర ఇంకాస్త ఎలివేట్‌ అయ్యేది.
సంగీత దర్శకుడిగా తెలుగులో అనిరుధ్‌ తొలి సినిమా అయిన ‘అజ్ఞాతవాసి’ గ్రాండ్‌ లాంచ్‌ అనే చెప్పాలి. మంచి పాటలను అందించాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోరీ బావుంది. పర్వాలేదు. వి.మణికందన్‌ కెమెరా పనితనం బాగుంది. పవన్‌కల్యాణ్‌  ఇంట్రడక్షన్ సీన్ సినిమాకు హైలెట్. యాక్షన్ సన్నివేశాలను ముఖ్యంగా బల్గేరియాలో ఛేజింగ్‌ సన్నివేశాలను చిత్రీకరించిన విధానం బాగుంది. డైలాగ్స్ లో దర్శకుడు త్రివిక్రమ్‌ మరోసారి తన మార్కును చూపించాడు. అయితే దర్శకుడి కన్నా త్రివిక్రమ్‌లోని రచయితకు ఎక్కువ మార్కులు పడతాయి. ఇక శర్మ-వర్మ సంభాషణల్లో త్రివిక్రమ్‌ శైలి హాస్యం నూటికి నూరు పాళ్లు కనిపిస్తుంది. ప్ర‌థ‌మార్ధంలో వచ్చే డైలాగుల్లో డెప్త్‌ ఉంది. ‘విచ్చలవిడిగా నరికేస్తే హింస… విచక్షణతో నరికేస్తే ధర్మం’ వంటి డైలాగ్‌లు ఆకట్టుకుంటాయి. అయితే క‌థ‌, క‌థ‌నాల‌పై మ‌రింత దృష్టి పెడితే బాగుండేది.
ప్లస్ పాయింట్స్
+ పవన్‌ కల్యాణ్‌
+ ఇంటర్వెల్
+ ఖుష్బు నటన
+ కొడకా కోటేశ్వరరావు పాట
మైనస్
– స్టోరీలో బలం లేకపోవడం
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15497
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author