అజ్ఞాతవాసి కి కాసులపంట

అజ్ఞాతవాసి కి కాసులపంట
January 10 21:09 2018
హైదరాబాద్,
యూఎస్ ప్రీమియర్స్ షో వసూళ్ల విషయంలో అనుకున్నట్టుగానే అత్యంత భారీ వసూళ్లను సాధించింది పవన్ కల్యాణ్ సినిమా అజ్ఞాతవాసి. ఇది వరకటి తెలుగు సినిమాల ప్రీమియర్ వసూళ్ల రికార్డులను సవరించింది ఈ సినిమా. అయితే టాప్ పొజిషన్ ను మాత్రం సొంతం చేసుకోలేకపోయింది. కానీ.. కీలకమైన బాహుబలి రికార్డును దాటేసింది పవన్ సినిమా.యూఎస్ ప్రీమియర్ షోస్ లో అజ్ఞాతవాసి 14,13,000 డాలర్ల వసూళ్లను సాధించింది. తద్వారా ప్రీమియర్స్ లోనే దాదాపు ఒకటిన్నర మిలియన్ డాలర్ల మార్కు వసూళ్లకు రీచ్ అయ్యింది. భారత ద్రవ్యమానంలో చెప్పాలంటే దాదాపు పది కోట్ల రూపాయలతో సమానం.యూఎస్ ప్రీమియర్స్ లో అత్యధిక వసూళ్లను సాధించిన తెలుగు సినిమాల జాబితాలో రెండో స్థానాన్ని సంపాదించింది ఈ సినిమా. తొలి స్థానంలో బాహుబలి-2 ఉంటుంది. దాని వసూళ్లు దాదాపు నాలుగున్నర మిలియన్ డాలర్లు. మూడోస్థానంలో బాహుబలి పార్ట్ వన్ ఉంటుంది. అది 1.3 మిలియన్ డాలర్ల స్థాయి వసూళ్లను సాధించింది.ఇక ఖైదీ నంబర్ 150 రమారమీ 1.29 మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది. ఇవీ యూఎస్ ప్రీమియర్స్ లోనే వన్ మిలియన్ డాలర్ల వసూళ్ల మార్కును దాటేసిన సినిమాలు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15551
YouTube
Pinterest
LinkedIn
Instagram
  Article "tagged" as:
  Categories:
view more articles

About Article Author