12 పాయింట్లు దాటితే వాహనం నడపకుండా నిషేధం

12 పాయింట్లు దాటితే వాహనం నడపకుండా నిషేధం
January 11 13:58 2018
హైదరాబాద్
జంట నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు నిబంధనల ఉల్లంఘించే వారి పని పడుతున్నారు. 12 పాయింట్లు దాటితే వారు వాహనం నడిపేందుకు అవకాశం లేకుండా నిషేధం విధిస్తున్నారు. 14 పాయింట్లకు చేరిన వ్యక్తి డ్రైవింగ్ లైసెన్స్ రద్దుకు చర్యలు ఈమేరకు   ఆర్టీఏ అధికారులు నోటీసులు జారీ చేసారు. ఆ ఏమవుతుందిలే అనే లెక్కలేని తనంలో సిగ్నల్స్ జంపింగ్, హెల్మెట్ లేకుండా నడపడం, తాగి నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం, ఇలా ఒకటేమిటి తమ కంట్లో పడిన ప్రతీ ఉల్లంఘనను లెక్క పెట్టి ఆయా ఉల్లంఘనుల డ్రైవింగ్ లైసెన్స్ ఖాతాలో పాయింట్లుగా నమోదు చేస్తున్నారు. హైదరాబాద్ లో ఇలా ఓ వాహనదారుడు, మౌలాలీకి చెందిన రుషబ్ మహేంద్రమేనియా 14 పాయింట్లు చేరుకోవడంతో అతని లైసెన్స్ ను రద్దు చేసేందుకు రవాణా శాఖ నోటీసులు కూడా జారీ చేసింది.నగరంలో 7 పాయింట్లు పోగేసుకున్న వారి సంఖ్య 46 కాగా, 152 మంది ఖాతాలో 6 పాయింట్లు జమ అయ్యాయి. 2,858 మంది ఖాతాలో 4 పాయింట్లు, 8,809 మంది ఖాతాలో 3 పాయింట్లు, 40,521 మంది ఖాతాలో 2 పాయింట్లు, 2,55,566 మంది ఖాతాలోకి ఒక పాయింటు చొప్పున పోలీసులు ఇప్పటికే జమ చేశారు. 350 మంది ట్రాఫిక్ పోలీసులు ప్రతి రోజూ ఇలా వాహన ఉల్లంఘనదారుల ఖాతాలో పాయింట్లను జమ చేస్తున్నారు. 12 పాయింట్లు దాటి 13వ పాయింటు నమోదు అయిన వెంటనే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేసేందుకు ఏర్పాట్లు కూడా చేశారు. లైసెన్స్ రద్దయ్యాక వాహనం నడుపుతూ పట్టుబడితే జైలుకు పంపిస్తారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15577
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author