ఆగని టీడీపీ బీజేపీ  వార్

ఆగని టీడీపీ బీజేపీ  వార్
January 11 15:32 2018
తాడేపల్లిగూడెం,
తాడేపల్లిగూడె మున్సిపల్ చైర్మన్ బొలిశెట్టి శ్రీనివాస్ పై తాజాగా దేవాదాయ శాఖా మంత్రి పైడికొండల మాణిక్యాలరావు మండిపడ్డారు. నన్ను ఆఫ్ట్రాల్ ఫోటో గ్రాఫర్ అని మున్సిపల్ చైర్మన్ కామెంట్ చేసాడు. అవును నేను ఆఫ్ట్రాల్ ఫోటోగ్రాఫర్ నేనని అన్నారు. నాపై కామెంట్లు చేస్తున్న నీవు నీ చరిత్ర ఎంటో తెలిసుకో, నేను నీ చరిత్ర బయటకు తీయడానికి క్షణం పట్టదని హెచ్చరించారు. రోజుకి 18గంటలు కష్టపడేవాడు సిగ్గుపడక్కర్లేదు,  కన్నాలేసేవాడే సిగ్గుపడాలని మంత్రి ఘాటుగా వ్యాఖ్యానించారు. నీకు దమ్ముంటే నా చరిత్ర గురించి తెలుసుకో. నువ్వెంత వెతికినా నా వెనుక నా కష్టమే కనపడుతుందని అన్నారు.
Please follow and like us:
RSS
Follow by Email
Facebook
Facebook
Google+
http://www.7gnews.in/?p=15604
YouTube
Pinterest
LinkedIn
Instagram
view more articles

About Article Author